Ram Charan Upasana: ఆ దేశంలో ఉపాసన సీమంతం.. పిక్స్ వైరల్.. అక్కడ ఎందుకు చేశారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. చెర్రీ-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా క్లారిటీ రావడం అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. మెగా వారసుడు వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో వైరల్ గా మారింది ఈ వార్త. తర్వాత ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సైతం నెట్టింట్లో హల్ చల్ చేశాయి. అయితే తాజాగా విదేశంలో ఉపాసన సీమంతం వేడుకలు జరిగాయి. ఆ విశేషాల్లోకి వెళితే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన ఇద్దరు కూడా రెండు ఉన్నతమైన కుటుంబాలుకు చెందినవారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమైనప్పటికీ కూడా వారు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయి పదేళ్లయినా వారి మొదటి ప్రెగ్నెన్సీ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అనేక రకాల వార్తలు వచ్చాయి.

Ram Charan Wife Upasana Konidela Baby Shower Celebration In Dubai

ఇక శ్రీ హనుమాన్ దీవెనలతో ఉపాసన, రామ్ చరణ్ వారి మొదటి బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నారు అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేయడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అనంతరం ఉపాసన సరోగసీ ద్వారా బిడ్డను కనబోతుందని మరో వార్త జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలకు ఉపాసన బేబీ బంప్ తో కనపడి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇటీవల రామ్ చరణ్-ఉపాసన జంట సమ్మర్ వెకేషన్ కు దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

Ram Charan Wife Upasana Konidela Baby Shower Celebration In Dubai

దుబాయ్ వెకేషన్ కు చెర్రీ-ఉపాసనతోపాటు కొంతమంది సన్నిహితులు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే గ్రాండ్ గా ఉపాసన బేబీ షవర్ పార్టీని (సీమంతం) ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ఈ పార్టీలో ఇద్దరు తరఫు కజిన్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నట్లు టాక్. వాళ్లందరి సమక్షంలో ఉపాసన బేబీ షవర్ పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుక దుబాయ్ లోని నమ్మోస్ బీచ్ క్లబ్ లోని స్వాంకీ ప్రాంతంలో జరిగనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వెకేషన్ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పాల్గొంటాడని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X