మెగా ఫ్యాన్స్‌కు శుభవార్త.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ దంపతులు.. చిరంజీవి ఇంటిలో సంబురాలు!
మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సంబురాలు మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీ వారసురాలు రాకతో సంతోషంలో మునిగిపోయారు. రాంచరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవేళ కోసం ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న గడియలు మెగా ఫ్యాన్స్‌కు ఆనందం కలిగించాయి. ఉపాసన దంపతులు జన్మనిచ్చిన చిన్నారి గురించిన వార్త వివరాల్లోకి వెళితే..
రాంచరణ్ సతీమణి కొద్ది నెలల క్రితం గర్బవతి అయ్యారనే వార్త మెగా ఫ్యాన్స్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన కుటుంబంలో చేరబోతున్న చిన్నారి వార్తను అందించి స్వయంగా అభిమానులకు తీపి కబురు చెప్పారు. అయితే ఆ సమయంలోను జూన్, జూలైలో ఎప్పడైనా శుభవార్త వినవచ్చు అని చెప్పారు.

అయితే ఉపాసన కొణిదెల గర్బవతిగా ఉన్న సమయంలో రాంచరణ్ తాను నటించిన RRR సినిమా కోసం ఆస్కార్ అవార్డు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో రాంచరణ్‌తో ఉపాసన అమెరికాలో బిజీగా కాలం గడిపింది. అమెరికాలోని ఉన్నత వైద్య నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన సలహాలు, సూచనలు పొందారు.
ఇక ఉపాసన కొణిదెల ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 20వ తేదీన అపోలో హాస్పిటల్ వైద్యులు పర్యవేక్షణలో డెలివరీ జరిగింది. రాంచరణ్‌తోపాటు ఉపాసన కుటుంబ సభ్యులంతా హాస్పిటల్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం వారు హాస్పిటల్‌కు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. ఈ సందర్భంగా మెగా అభిమానులు చిరంజీవికి, రాంచరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











