Upasana: నేను వారికోసం గర్భవతిని కాలేదు.. ఉపాసన మదర్స్ డే పోస్ట్ వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన ఇద్దరు కూడా రెండు ఉన్నతమైన కుటుంబాలుకు చెందినవారు. వీరిది పెద్దలకు కుదిర్చిన వివాహమైనప్పటికీ కూడా వారు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయి పదేళ్లకు వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు చిరంజీవి ప్రకటించి గుడ్ న్యూస్ తెలిపారు. ప్రస్తుతం బేబీ బంప్ తో ఉన్న ఉపాసన ఫొటోలు వైరల్ కాగా మదర్స్ డే సందర్భంగా పోస్ట్ షేర్ చేశారు.

శ్రీ హనుమాన్ దీవెనలతో ఉపాసన, రామ్ చరణ్ వారి మొదటి బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నారు అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. కానీ ఉపాసన సరోగసీ ద్వారా బిడ్డను కనబోతుందన్న వార్తలు జోరుగా రావడంతో ఆమె బేబీ బంప్ ఉన్న ఫొటోలు వాటికి చెక్ పెట్టేశాయి. ఇటీవల రామ్ చరణ్-ఉపాసన జంట సమ్మర్ వెకేషన్ కు దుబాయ్ వెళ్లగా అక్కడ బేబీ షవర్ పార్టీ కూడా నిర్వహించారు.

Upasana Konidela

దుబాయ్ లో ఉపాసన సీమతం వేడుకలకు సంబంధించిన ఫొటోలు వైరల్ కూడా అయ్యాయి. అయితే తాజాగా మే 14 ఆదివారం మదర్స్ డే సందర్బంగా బ్లాక్ కలర్ డ్రెస్సులో బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ నోట్ రాసుకొచ్చారు ఉపాసన. తాను ఇప్పుడు మాతృత్వపు మధురిమను ఆస్వాదిస్తున్నట్లు, తల్లి కాబోతున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన తాజాగా షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు.

"సమాజం ఏదో అనుకుంటుందని, లేదా వాళ్ల అంచనాలు అందుకోవాలని నేను గర్భవతిని కాలేదు. మా వివాహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాడనికి లేదంటే వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతోనో ప్రెగ్నెంట్ కావాలనే నిర్ణయాన్ని తీసుకోలేదు. నేను మానసికంగా సిద్ధమైన తర్వాత, నాకు బిడ్డకు ఎలాంటి అవధులు లేని ప్రేమను ఇవ్వగలనని, జాగ్రత్తగా బిడ్డను చూసుకోగలనని అనుకున్న తర్వాత జన్మ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని ఉపాసన తెలిపారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన కొణిదెల పోస్ట్ వైరల్ గా మారింది. ఉపాసనకు స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంత, సంయుక్తా మీనన్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ తదితరులు మదర్స్ డే విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే ప్రెగ్నెన్సీకి ముందు అనేక ఇంటర్వ్యూలో పిల్లలను కనకపోవడంపై ఉపాసన వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రెగ్నెన్సీ, పిల్లల పెంపకంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X