Ram Charan దంపతులు పిల్లలను కనరు అంటూ వార్తలు.. ఓ మై గాడ్ అని ఉపాసన రియాక్షన్!

మెగా కోడలు ఉపాసన కొణిదెల ఒకవైపు అపోలో సంబంధించిన వ్యవహారాల్లో కీలకమైన బాధ్యతల్లో కొనసాగుతూనే మరొకవైపు రామ్ చరణ్ సతీమణిగా కూడా ఆమె తన బాధ్యతను సమానంగా నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగి 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా పిల్లలు కనకపోవడంపై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల ఆ విషయంపై సద్గురును ఉపాసన ఒక ప్రశ్న కూడా అడిగారు. ఇక ఆ వార్తను వైరల్ కావడంతో పిల్లలను కనడానికి వారు ఆసక్తిగా లేరు అని కూడా మరికొన్ని వార్తలు వచ్చాయి. ఇక ఆ విషయంపై ఉపాసన వెంటనే రియాక్ట్ అయ్యారు.

సహాయపడే విధంగా..

సహాయపడే విధంగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన పవర్ఫుల్ ఉమెన్ గా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకుంటున్నారు. ఆమె ఎన్నో సామాజిక అంశాల్లో కూడా పాల్గొంటూ నలుగురికి సహాయపడే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా చాలామందికి ఆమె ఉచితంగా వైద్య సేవలు కూడా అందించడం జరిగింది.

గతంలోనే క్లారిటీ

గతంలోనే క్లారిటీ


రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగి దాదాపు 10 ఏళ్లయినా కూడా ఇంకా వారికి పిల్లలను కనక పోవడంపై నిత్యం మీడియాలో ఏదో ఒక చర్చ కొనసాగుతూనే ఉంటుంది. అది వారి వ్యక్తిగత విషయమైనప్పటికీ కూడా అనేక రకాల రూమర్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ విషయంలో ఇదివరకే ఉపాసన కొన్ని ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని కూడా ఆమె తెలియజేశారు.

సద్గురుతో ఆ ప్రశ్న

సద్గురుతో ఆ ప్రశ్న

ఇక రీసెంట్ గా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉపాసన కొణిదెలా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఉపాసన కొన్ని విషయాలపై చర్చలు జరుపుతూనే తన జీవితంలో నిత్యం ఎక్కువగా ఎదురవుతున్న ఒక ప్రశ్న గురించి కూడా అడిగారు. అందరూ తన జీవితంలోని పిల్లలు కనే విషయం గురించి ఎక్కువగా చర్చించుకుంటారు అని ఆమె అడగడంతో అందుకు సద్గురు కూడా పాజిటివ్ గా స్పందించే ప్రయత్నం చేశారు.

సద్గురు సమాధానం

సద్గురు సమాధానం

ముందుగా ఒకరి వ్యక్తిగత విషయంపై మరొకరు చర్చించుకోవాల్సిన అవసరం లేదు అని అయితే ముందుగా ఎవరైతే పిల్లలను కనకుండా ఉన్నారో వారందరికీ కూడా నేను బహుమతులు ఇస్తాను అని ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో జనాభా చాలా పెరిగిపోయింది అని ఇక కొన్నాళ్ల వరకు పిల్లలను కొనాల్సిన అవసరం లేదు అని.. సద్గురు వివరణ ఇచ్చారు. అందుకు ఉపాసన కూడా చాలా సరదాగా ఇకనుంచి మా ఇంటి నుంచి మీకు ఫోన్లు వస్తాయి అని అన్నారు.

సోషల్ మీడియాలో అలా వైరల్

సోషల్ మీడియాలో అలా వైరల్

అయితే ఆ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఇక ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా పిల్లలను కనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని వారు పిల్లలను కనే అవకాశం కూడా లేదు అని పలు నేషనల్ మీడియాలో కూడా కథనాలు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక వెంటనే ఉపాసన వాటిపై రియాక్ట్ అయ్యారు.

 నిజం కాదని..

నిజం కాదని..


ఓ మై గాడ్ ఇది నిజం కాదు అంటూ ఆమె కొంచెం సాడ్ గా ఉన్న ఎమోజిని కూడా జత చేశారు. అంతేకాకుండా పూర్తి వీడియోను చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి అని నా కాపీని కూడా చదివి ఉండాల్సింది అని ఆమె వివరణ ఇచ్చారు. అంటే ఉపాసన చెప్పిన దాని ప్రకారం పిల్లలను కనే విషయంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఈ విషయంలో మెగా ఫాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X