Upasana Konidela: నమ్రత దారిలోనే ఉపాసన.. పుట్టబోయే బిడ్డ కోసం అలాంటి నిర్ణయం!

మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక అంశాలపై చర్చిస్తూ సోషల్ మీడియా వేదికగా నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఓవైపు ప్రఫొషనల్ లైఫ్ లీడ్ చేస్తూనే మరోవైపు ఫ్యామిలీని చక్కదిద్దుతుంటారు.

రెండింటిని సమపాలల్లో బ్యాలెన్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఉపాసన కొణిదెల త్వరలో మాత్రమూర్తిగా ప్రమోషన్ కొట్టనున్న విషయం తెలిసిందే. ఇక తల్లిగా తనకు పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు ఉపాసన. అదేంటనే విషయంలోకి వెళితే..

Ram Charan Wife Upasana Konidela Stem Cell Banking Process For Unborn Child

పెళ్లయిన పదేళ్లకు: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన ఇద్దరు కూడా రెండు ఉన్నతమైన కుటుంబాలుకు చెందినవారు. వీరిది పెద్దలకు కుదిర్చిన వివాహమైనప్పటికీ కూడా వారు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయి పదేళ్లకు వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు చిరంజీవి ప్రకటించి గుడ్ న్యూస్ తెలిపారు.

త్వరలో పేరెంట్స్: శ్రీ హనుమాన్ దీవెనలతో ఉపాసన, రామ్ చరణ్ వారి మొదటి బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నారు అని చిరు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేశారు. ఇప్పటికే ఉపాసన కొణిదెల బేబీ బంప్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్ లో బేబీ షవర్ పార్టీ కూడా జరిగింది. త్వరలో రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.

Ram Charan Wife Upasana Konidela Stem Cell Banking Process For Unborn Child

స్టెమ్ సెల్ విధానం: ఈ నేపథ్యంలో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలతోపాటు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో ముఖ్యంగా బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో బేబీతోపాటు కుటుంబ ఆరోగ్యం కోసం అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు ఉపాసన.

అనారోగ్య సమస్యల నుంచి: స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే బొడ్డు తాడు దాచుకోవడం. భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే దీని ద్వారా నయం చేయవచ్చు. అయితే దీని గురించి చాలా మందికి తెలియదు. పిల్లలు పుట్టినప్పుడు బొడ్డు తాడు దాచడం వల్ల పెద్దయ్యాక వాళ్లకది బాగా ఉపయోగపడుతుంది. అది ఎన్నో రకాల చికిత్సల కోసం ఫ్యూచర్ లో వినియోగిస్తారు.

Ram Charan Wife Upasana Konidela Stem Cell Banking Process For Unborn Child

ఇద్దరి విషయంలో: ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానంపై ఇండియాలో పెద్దగా అవగాహన లేదు. కానీ గతంలో మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఈ విషయంపై మాట్లాడారు. తమ పిల్లలైన గౌతమ్, సితార స్టెమ్ సెల్స్ దాచిపెట్టినట్లు నమ్రతా శిరోద్కర్ తెలిపారు. పిల్లలిద్దరి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X