twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబ్బుర పరుస్తున్న రామ్ చరణ్ టాలెంట్.. ఫిదా అయిన సమంత

    |

    రామ్ చరణ్ నటన, డ్యాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రిని మించిన తనయుడిగా నిరూపించుకున్నాడు. పట్టు మని పది సినిమాలు కూడా తీయకుండానే రెండు ఇండస్ట్రీ హిట్‌లతో దూసుకుపోతున్నాడు. అయితే ఇదంతా సినీ రంగం వైపు చరణ్ సాధించిన విషయాలే కానీ, అతనిలో నిగూఢంగా దాగి ఉన్న మరో ప్రతిభ ఉందన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు.

     ప్రకృతి ప్రేమికుడు..

    ప్రకృతి ప్రేమికుడు..

    రామ్ చరణ్ ప్రకృతి ప్రేమికుడన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా తనకు మూగ జీవులన్నా, వన్యప్రాణులన్న ఎంతో ఇష్టం. రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా హార్స్ ఫామ్ హౌస్ ఉందన్న విషయం తెలిసిందే. పలు రకాలు పశుపక్ష్యాదులను, వన్యప్రాణులను పెంచుతూ వాటిని సంరక్షిస్తూ ఉంటాడు. తాజాగా తనలోని ఈ ఇష్టం ఎంతగా పెరిగిపోయిందన్న విషయం బయటకు తెలిసింది. యాక్టర్‌గానే కాకుండా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గానూ అవతారమెత్తాడు.

    వన్యప్రాణులను కెమెరాలో బంధించిన చెర్రీ...

    వన్యప్రాణులను కెమెరాలో బంధించిన చెర్రీ...

    ఆ మధ్య ఈ ఇద్దరు కలిసి ఆఫ్రికాలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సందర్శించిన సంగతి తెలిసిందే.అక్కడి రకరకాలు జంతువులు, వాటిని పెంచే విధానం, సంరక్షించే పద్దతుల గురించి తెలుసుకున్నారు. అక్కడి రకరకాల జాతులకు చెందిన వన్యప్రాణుల ఫోటోలను స్వయంగా చిత్రీకరించాడు. ఈ రకంగా తన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ టాలెంట్‌ను అందరికీ తెలిసేలా చేశాడు.

    భారీ హంగులతో కొత్త నివాసం..

    భారీ హంగులతో కొత్త నివాసం..

    రామ్ చరణ్-ఉపాసనల నివాసం కోసం ప్రత్యేకంగా ఓ ఇంటిని నిర్మించుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇంటీరియర్ డిజైన్ కోసం ప్రపంచ ప్రసిద్ది చెందిన వారితో అలంకరించేందుకు ప్లాన్ చేశారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తోన్న ఈ భవంతిలోకి త్వరలోనే ప్రవేశించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ ఇంట్లోనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన మ్యూజియం లాంటిది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

    నిధుల సేకరణ..

    నిధుల సేకరణ..

    రామ్ చరణ్‌లోని ఈ టాలెంట్‌ను చూసేందుకు అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, సమంత, మంచు లక్ష్మీ, నిహారిక, సుష్మిత, శ్రీజ లాంటి వారు వచ్చారు. వన్యమృగాల సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా చేపట్టే సహాయ నిధి కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నాడు. రామ్ చరణ్, ఉపాసన కలిసి హోస్ట్ చేసే ఈ ఈవెంట్‌ను వైల్డెస్ట్ డ్రీమ్స్ అని నామకరణం చేశారు.

    ఫిదా అయిన తారలు..

    ఫిదా అయిన తారలు..

    ఈ మ్యూజియాన్ని, రామ్ చరణ్ షూట్ చేసిన వన్యప్రాణుల ఫోటోలను చూసి అందరూ షాక్ అయ్యారు. రామ్ చరణ్‌ అమేజింగ్ టాలెంట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఈ హిడెన్ టాలెంట్ మంచు లక్ష్మీ సైతం కొనియాడింది. కుటుంబ సమేతంగా హాజరైన నాగార్జున ఈ మ్యూజియాన్ని చూసి షాక్ అయినట్టు తెలుస్తోంది.

    English summary
    Ram Charan Wildlife Photography Museum In His New Residence.Samantha, Nagarjuna, Amala And Manchu Lakshmi Shocked By Seeing Ram Caharan Talent. upasanakonidela, RamCharan will be hosting a Gala in aid of World Wildlife Fund, called ‘Wildest Dreams’ at their remodelled residence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X