అదిరిపోయే స్టెప్పులేస్తున్న చెర్రీ, జక్కన్న.. మార్క్ సెట్ చేస్తూ పోవాలంటూ రామ్ చరణ్ విషెస్

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు. ఇక సోషల్ మీడియాలో జక్కన్నకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ ప్రముఖులందరూ విషెస్ చెప్పారు. రాజమౌళి అభిమానులు కూడా తమ ప్రేమను ట్వీట్ల రూపంలో చూపిస్తున్నారు.

సైరా దుమ్ములేపిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. మీకు మున్ముందు ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. సైరాను వీక్షించిన అనంతరం.. రాజమౌళి చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఐకానిక్ డైరెక్టర్ అంటూ..

ఐకానిక్ డైరెక్టర్ అంటూ..

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టైల్లో రాజమౌళికి పుట్టినరోజు విషెస్ తెలిపాడు. ఐకానిక్ డైరెక్టర్ రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఫిల్మ్ మేకర్ జనరేషన్‌ మొత్తానికి మీరు ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. మున్ముందు ఇంకా బాగుండాలని తెలిపాడు.

అదిరిపోయే ఫోటో షేర్ చేస్తూ.. చెర్రీ విషెస్

అదిరిపోయే ఫోటో షేర్ చేస్తూ.. చెర్రీ విషెస్

రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహ మహోత్సవంలో రాజమౌళి, చెర్రీ కలిసి స్టెప్పులేసిన ఫోటోను షేర్ చేస్తూ.. జక్కన్న తన అభిమానాన్ని చాటుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపాడు. మీరు ఇలానే భారతీయ సినిమాల స్థాయిని, బెంచ్ మార్క్‌ను పెంచుకుంటూనే పోవాలని కోరుకుంటున్నాని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

 ఎన్టీఆర్, చరణ్‌లతో భారీ మల్టీస్టారర్..

ఎన్టీఆర్, చరణ్‌లతో భారీ మల్టీస్టారర్..

బాహుబలి ఫ్రాంచైజీ తరువాత జక్కన్న మరో మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రకటించి.. టాలీవుడ్‌ను షేక్ చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో సినిమా చేస్తున్నట్లుప్రకటించి.. ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్‌తోనే ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

టైటిల్ ఇదేనంటూ ప్రచారం...

ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ అని ప్రకటించినా.. అది జనాల్లోకి బాగా వెళ్లడంతో వాటితో సరిపోయే పేర్లను.. సూచించమని సోషల్ మీడియాలో కాంటెస్ట్ కూడా నిర్వహించారు. దీనికి పెద్ద మొత్తంలో స్పందన వచ్చింది. అయితే రీసెంట్‌గా ఈ టైటిల్‌పై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. రామ రౌద్ర రుషితం అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కొమ్రంభీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 30న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X