RRR Oscars: రాజమౌళి ఇంట్లో ఆస్కార్ సెలబ్రేషన్స్.. అవార్డులతో రామ్ చరణ్ అలా.. ఫొటోలు వైరల్

తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రం RRR. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ సినిమాపై యావత్ ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ గెలిచిన ఈ సినిమా అంతకుముందే అనేక పురస్కారాలు సాధించి ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ గెలిచిన సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో తెలుపుతూ ఆయన సతీమణి ఉపాసన కొన్ని ఫొటోలు షేర్ చేశారు.

ఒరిజినల్ సాంగ్ లో..

ఒరిజినల్ సాంగ్ లో..

తెలుగు చిత్రీసీమ దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. ఇక గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా RRR.

ఈ సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట మొదలైంది. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది ఈ చిత్రం. తాజాగా ఆస్కార్ 2023 సంవతర్సానికి గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే.

ఫిదా అయిన వరల్డ్..

ఫిదా అయిన వరల్డ్..

రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, దర్శకుడు రాజమౌళి టేకింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం, పాటలు, కొరియోగ్రఫీ, యాక్షన్ స్టంట్స్ అన్నింట్లో మార్కులు కొట్టేసింది RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టగా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హావాభావాలు, ఎమోషన్స్ కు యావత్ ప్రపంచమే ఫిదా అయి ప్రశంసల జల్లులు కురిపించింది.

అమెరికా వెళ్లగా..

అమెరికా వెళ్లగా..

ఇక RRRలోని నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందన్న ప్రగాఢ నమ్మకంతో ఆస్కార్ వేడుకల కంటే ముందుగానే చిత్ర యూనిట్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. మొదటగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) అవార్డ్స్ ప్రదానోత్సవంలో పాల్గొంది RRR టీమ్.

ఈ అవార్డ్సులో ఏకంగా ఐదు విభాగాల్లో RRR సినిమా నామినేట్ అయి పురస్కారాలు సాధించింది. అంతకుముందు గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ వంటి అవార్డ్సు గెలుచుకుంది.

తారక్ తో మరోసారి..

తారక్ తో మరోసారి..

తాజాగా RRRకు అవార్డ్ లభించింది. దీంతో యావత్ తెలుగు సినీ ప్రేక్షకలోకం సంతోషంలో మునిగిపోయింది. ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న ఎమ్ఎమ్ కీరవాణి తన సంతోషాన్ని పాట రూపంలో తెలియజేశారు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒకరినొకరు హగ్ చేసుకుని మరి తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు. ట్విటర్ వేదికగా రామ్ చరణ్ పోస్ట్ షేర్ చేసి అందులో.. తారక్ కు ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి అతనితో డ్యాన్స్ చేయాలని ఉందని రాసుకొచ్చారు.

రాజమౌళి ఇంట్లో..

రాజమౌళి ఇంట్లో..

ప్రస్తుతం RRR టీమ్ ఆస్కార్ గెలవడాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా లాస్ ఎంజెల్స్ లో రాజమౌళి స్టే చేసిన హోటల్ లో ఆస్కార్స్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో ఎమ్ఎమ్ కీరవాణి తన గాత్రంతో అలరించారు.

ఇదే పార్టీలో రామ్ చరణ్ స్టెప్పులు వేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆస్కార్ వేడుక తర్వాత హోటల్ కు వెళ్లే క్రమంలో రామ్ చరణ్ విదేశీ అభిమానులు సెండాఫ్ ఇచ్చారు. కారులో వెళ్తున్న చెర్రీని చూసి అరుస్తూ తమ అభిమానాన్ని చాటారు.

అవార్డులతో రామ్ చరణ్..

అవార్డులతో రామ్ చరణ్..

రాజమౌళి RRR సినిమాకు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ తో పాటు పలు ఇంటర్నేషనల్ పురస్కారాలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్, హెచ్సీఏ అవార్డ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ అవార్డులన్నింటితో రామ్ చరణ్ ఒక ఫొటో దిగారు.

RRRకు వచ్చిన అవార్డులన్నింటిని పేర్చి పైన ఆస్కార్ అవార్డ్ పెట్టి చెర్రీ పోజు ఇచ్చారు. ఈ ఫొటోలను రామ్ చరణ్ భార్య ఉపాసన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X