రామ్ చరణ్ ‘పెద్ది' పవర్ ప్లే టూర్ .. బుచ్చి బాబు క్రేజీ ప్లానింగ్!

PEDDI POWERPLAY TOUR : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటిస్తోన్న రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో, సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్లతోనే సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, కేవలం కంటెంట్‌తోనే కాదు... దేశవ్యాప్తంగా ప్లాన్ చేసిన భారీ ప్రమోషనల్ టూర్‌తో కూడా రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.

'పెద్ది పవర్‌ప్లే టూర్'తో దేశవ్యాప్త హంగామా
పెద్ది సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరవేయాలనే లక్ష్యంతో మేకర్స్ ప్లాన్ సిద్దం చేశారు. "పెద్ది పవర్‌ప్లే టూర్" పేరిట గ్రాండ్ ప్రమోషన్స్ ప్రణాళిక రూపొందించారు. మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో ఈ టూర్ ప్రారంభం కానుంది. దేశ ఆర్థిక రాజధానిలోనే ప్రారంభమవుతున్న ఈ ఈవెంట్ ద్వారా బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అక్కడి నుంచి వరుసగా కీలక నగరాల్లో ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ను పీక్‌కు తీసుకెళ్లాలని టీమ్ ప్లాన్ చేసింది. మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కూడా 'పెద్ది' టీమ్ ప్రత్యేకంగా హాజరుకానుండటం విశేషం. క్రికెట్ నేపథ్యం ఉన్న కథ కావడంతో ఈ ప్రమోషన్ మరింత కనెక్ట్ అవుతుందని అంచనా.

Ram Charan s Peddi Powerplay Tour Sparks Nationwide Buzz Ahead of Grand Release

దేశంలోని కీలక నగరాల్లో వరుస ఈవెంట్లు
ఈ పవర్‌ప్లే టూర్ షెడ్యూల్‌ను పరిశీలిస్తే, ముంబై నుంచి హైదరాబాద్ వరకు దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీ కవర్ చేసేలా ప్లాన్ చేశారు. మే 23న భోపాల్,మే 24న బెంగళూరు, మే 28న ఢిల్లీ, మే 30న చెన్నై వంటి నగరాల్లో ప్రత్యేక ఈవెంట్లు, ప్రెస్ మీట్స్ నిర్వహించనున్నారు. మే 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ లాంచ్ కూడా ఉండనుందని సమాచారం. ఇక జూన్ 1న విజయనగరం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అక్కడే ఒక ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేయడం సినిమాకు ఉన్న ప్రాంతీయ కనెక్ట్‌ను మరింత బలపరుస్తోంది.

టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఈవెంట్?
జూన్ 2న హైదరాబాద్‌లో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉప్పల్ స్టేడియం వేదికగా భారీ స్థాయిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలవబోతుందనే టాక్ వినిపిస్తోంది. భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ఇక ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించడం మరో ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన సంగీతానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఓవర్సీస్‌లో ప్రముఖ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ పంపిణీ చేపట్టడం కూడా గ్లోబల్ రీచ్‌ను పెంచుతోంది.

జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, జూన్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది. 'పెద్ది' సినిమా విషయంలో మేకర్స్ స్పష్టమైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. కేవలం సినిమా రిలీజ్ కాకుండా, ఒక ఈవెంట్‌లా దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రికెట్, మాస్ యాక్షన్, ఎమోషన్ అన్ని కలిపిన ఈ ప్రాజెక్ట్‌ను భారీ ప్రమోషన్స్‌తో మార్కెట్ చేయడం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇలా కంటెంట్‌తో పాటు ప్రమోషన్లలో కూడా దూకుడు చూపిస్తున్న 'పెద్ది' సినిమా విడుదలకు ముందే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు మిగిలింది ఒక్కటే ఈ భారీ హైప్‌ను బాక్సాఫీస్ ఎలాంటి విజయంగా మలుస్తుందా లేదా అన్నది చూడాలి.

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X