Dating: రామ్ చరణ్‌తో వారంలో ఒక రోజు అలా డేటింగ్.. ఉపాసన

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్‌లో ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం, ఆ తర్వాత ఓజీ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం, వరుణ్ తేజ్ - లావణ్యలకు వారసుడు పుట్టడంతో పాటు ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సూపర్‌హిట్ కావడంతో మెగా క్యాంప్ సంబరాలు చేసుకుంటోంది. ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ త్వరలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తీపి కబురు అందించనున్నారు. ఆమె మరోసారి గర్భం దాల్చడంతో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఈసారి వారసుడు రాబోతున్నాడని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అటు ఉపాసన కూడా ఇంట్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు. భర్త రామ్ చరణ్‌కు తోడుగా ఉంటూనే తన బిజినెస్, రోజువారీ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటూనే... కుటుంబానికి సమయం కేటాయిస్తున్నారు. అత్తగారు సురేఖ, రామ్ చరణ్ నాయనమ్మ అంజనా దేవిలతో సరదాగా గడుపుతూ దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలాగే అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండటంతో ప్రజలకు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తుంటారు ఉపాసన.

Ram Charan s wife Upasana Konidela s Relationship Advice How Small Efforts Build Strong Marriages

నిజానికి రామ్ చరణ్‌తో ఉపాసన పరిచయం కూడా విభిన్నంగా జరిగింది. ఓ స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్‌కు వెళ్లగా.. అక్కడే ఉపాసనతో రామ్ చరణ్‌కు తొలిసారి పరిచయం ఏర్పడింది. అనంతరం పలుమార్లు వీరు కలుసుకోగా.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. సుధీర్ఘకాలం ప్రేమాయణం తర్వాత ఇరు కుటుంబాల్లోనూ తెలియడం... దీనికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2011 డిసెంబర్ 11న వీరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. ఆ తర్వాత ఆరు నెలలకు 2012 జూన్ 14న రామ్ చరణ్ - ఉపాసనల పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్లయి దాదాపు పదేళ్లు అయినా పిల్లలు లేకపోవడంతో రామ్ చరణ్- ఉపాసనలపై ట్రోలింగ్ జరిగింది. వీటిని ఉపాసన ధీటుగా ఎదుర్కోవడంతో పాటు భర్త, కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ క్రమంలో అందరి ఆశలు ఫలించి 2023 జూన్‌లో ఉపాసన - రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి క్లీం కార అనే పేరు పెట్టుకున్నారు. పాప రాకతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఇక గతేడాది దీపావళకి రామ్ చరణ్ - ఉపాసనలు మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి వేడుకలతో పాటు ఉపాసనకు శ్రీమంతం వేడుకలు కూడా మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. త్వరలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఉపాసన సమాజానికి పనికొచ్చే కొన్ని విషయాలను షేర్ చేస్తుంటారు. అలాగే స్త్రీ హక్కులు, మహిళా సాధికారిత విషయంలోనూ ఉపాసన తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. బిజినెస్‌ఉమెన్‌గా, మెగా ఫ్యామిలీ కోడలిగా ఉపాసన మాటలు సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఆవిడ ఏం చేసినా, ఏం మాట్లాడినా అన్ని రకాలుగా ఆలోచించే చేస్తారని ప్రజల్లోనూ అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లయిన జంటలు తమ జీవిత భాగస్వామితో ఎలా వ్యవహరించాలి అన్న దానిపై పలు సూచనలు చేశారు ఉపాసన.

నేను, రామ్ చరణ్‌ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి వారం ఒక డేట్ నైట్ ఇంట్లో గడపటానికి ప్రయత్నిస్తాం. ఆ సమయంలో టీవీ, మొబైల్స్‌ను కూడా దూరం పెడతాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా రిలేషన్‌లో ఇద్దరి ఉనికి, ఇద్దరి మధ్య కమ్యునికేషన్ ప్రాముఖ్యతను ఇలాంటి హైలైట్ చేస్తాయి. హావభావాల కంటే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలతో బలమైన బంధాలు నిర్మించబడతాయని ఇది రుజువు చేస్తుంది. ఇది సోషల్ మీడియా ప్రేమ కాదు.. ఇది నిజ జీవిత ప్రేమ.. అందుకే ఇలాంటి వాటిని దంపతులు లక్ష్యాలుగా పెట్టుకోవాలని ఉపాసన పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X