ఆంటీలు కాస్త ఓపిక పట్టండి.. ఉపాసన పోస్ట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా ఉపాసన కొణిదెల తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. పైగా అపోలో హాస్పటల్స్ బాధ్యతలను కూడా చూస్తున్నారు. మరిన్ని బిజినెస్ లతోనూ ఉపాసన కొణిదెల నిత్యం బిజీగానే ఉంటున్నారు. ఎన్ని పనులున్నా.. తన కుటుంబానికి మాత్రం ఇవ్వాల్సిన సమయం ఇస్తుంటుంది. 2012లో మెగా కోడలిగా చిరంజీవి ఇంట అడుగుపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా మంచి పేరు సంపాదించుకుంది. చరణ్ కు సరైన జోడీగా.. మెగా కుటుంబం కోడలిగా తన బాధ్యతలను సరిగానే నిర్వహిస్తూ వస్తోంది.
ఇక ఉపాసన కొణిదెల అపోలో తో పాటు మరిన్ని వ్యాపారాలు కూడా చేస్తుంటారు. ఆమె నెట్ వర్త్ రూ.1,130 కోట్లకు ఉంటుందని అంచనా. వ్యాపారంలో ఎంత శ్రద్ధవహిస్తుంటారో గతంలో ఉపాసన ఇచ్చిన పలు వీడియోల ద్వారా తెలిసిపోతుంది. ఇక మెగా కోడలు సమయం ఉన్నప్పుడల్లా బిజినెస్ లు, కుటుంబ విషయాలను మెగా అభిమానులతో అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ చరణ్ ఫ్యాన్స్ ను కూడా సర్ ప్రైజ్ చేస్తూ ఉంటారు. చరణ్ సినిమాల గురించి అప్పుడప్పుడు హింట్ ఇస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే.. ఎన్నడూ ఒక్క విమర్శను కూడా ఎదుర్కోని ఉపాసన కొణిదెల తాజాగా తను షేర్ చేసిన పోస్ట్ ద్వారా కొన్ని కామెంట్లను ఎదుర్కొంటోంది. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన తన ఇన్ స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. 'వాలెంటైన్స్ డే 22 వయస్సు గల అమ్మాయిలకు మాత్రమే. ఆపైన ఉన్న ఆంటీలకు కాదు. దయచేసి విమెన్స్ డే వచ్చే వరకు ఆగండి ఆంటీలు' అంటూ స్టోరీ రాసుకొచ్చారు. దీంతో ఆమె పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వస్తుందనుకుంటే.. ఇలాంటి పోస్ట్ వచ్చిందేంటీ అంటూ మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.
మరోవైపు ఆమె వాలెంటైన్స్ డే సందర్భంగా ఇలాంటి పోస్ట్ ను ఎందుకు ఇన్ స్టోరీలో పెట్టిందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె మనస్సులోని మాట పూర్తిగా తెలియకపోవడంతో పలువు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కొందరు మాత్రం ఉపాసన నుంచి ఇలాంటి పోస్ట్ ఏంటని కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఉపాసన చేసిన పనికి ఇంటర్నెట్ షేక్ అయ్యిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. మెగా కోడలిగా ఉపాసన మంచి మార్కులు కొట్టేసింది. కుటుంబ సభ్యులతో ఎంతో కలిసి మెలిసి ఉంటోంది. రీసెంట్ గా చిరంజీవి తల్లి అంజనమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్ ను కూడా తానే జరిపించింది. మరోవైపు ఉపాసన మెగా ప్రిన్సెస్ క్లింకారను ఎప్పుడు చూపిస్తుందంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో 'ఆర్సీ16'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











