For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్.. రిలీజ్ కి సిద్దమైన అర్జీవి క్లైమాక్స్.. టికెట్ రేట్ ఫిక్స్!

    |

    విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అని మరోసారి రుజువయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా తన సినిమాలు డిఫరెంట్ గా రిలీజ్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో ఏబరు ఊహించని విధంగా సినిమా షూటింగ్స్ కూడా పూర్తి చేసి డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు శృంగార తార మియా మాల్కోవాతో తెరక్కెకించిన క్లైమాక్స్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు.

     క్లైమాక్స్ ఎప్పుడంటే..

    క్లైమాక్స్ ఎప్పుడంటే..

    మొత్తానికి రామ్ గోపాల్ వర్మ మియా మాల్కోవా తీసిన క్లైమాక్స్ సినిమాను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకోసం శ్రేయస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో చేతులు కలిపి స్పెషల్ యాప్ లో జూన్ 6న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. సెన్సార్ తో ఇబ్బందులు లేకుండా వర్మ స్పెషల్ ఫ్లాట్ ఫార్మ్ సెట్ చేసుకున్నాడు.

     అందరికి ఒకటే రేట్..

    అందరికి ఒకటే రేట్..

    ఇక ఈ సినిమా చూడాలంటే అందరికి ఒకటే రేట్. ఒక వ్యూవ్ కోసం 100రూపాయలు ఫిక్స్ చేశారు. త్వరలోనే లాగ్ ఇన్ డీటెయిల్స్ వస్తాయని చెబుతూ.. జూన్ 6వ తేదీన రాత్రి 9గంటల నుంచి సినిమా ఆన్లైన్ లో సందడి చేయనున్నట్లు వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఒక వ్యూవ్ కోసం వంద రూపాయలు ఫిక్స్ చేయడంతో నెటీజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

    మరో ట్రైలర్..

    మరో ట్రైలర్..

    ఇప్పటికే క్లైమాక్స్ టీజర్ ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన అర్జీవి నెక్స్ట్ మరొక ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాడు. శనివారం సాయంత్రం 5గంటలకు సెకండ్ ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు అర్జీవి. మియా మాల్కోవా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాతో అర్జీవి ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

    ఎవరు అడ్డుకోలేరు.

    ఎవరు అడ్డుకోలేరు.

    కరోనా సమయంలో థియేటర్స్ క్లోజ్ అవ్వడం వలన మరో రెండు నెలల పాటు ఎలాంటి సినిమాలు విడుదల అయ్యే అవకాశం లేదని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. సినిమా షూటింగ్స్ జరగడమే కష్టంగా ఉన్న సమయంలో సినిమాలను రిలీజ్ చేయడం అనేది చాలా కష్టమైన పనిగా మారింది. అయితే అర్జీవి మాత్రం లాక్ డౌన్ తో సంబంధం లేదని తన సినిమాను ఎవరు అడ్డుకోలేరని ఇటీవల కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

    English summary
    Ram Gopal is all set to release the climax movie of Mia Malkova in a digital flat form. For that, Shreyas Entertainment has joined hands with them to release the special app on June 6th. Verma has set up a special flat form with no trouble with the censor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X