అమృతకు ఆర్జీవి సందేశం.. ఆఖరి సమాధానం ఇదే అంటూ.. మరో షాకింగ్ పోస్టర్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొన్నటివరకు హాట్ మసాలా సినిమాలతో కాస్త హడావుడి చేసిన విషయం తెలిసిందే. అయితే సడన్ గా ఆయన ఆలోచన ఎలా షిఫ్ట్ అవుతుందో మరోసారి చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ ప్రేమ హత్య కేసును సినిమా రూపంలో చూపించనున్నట్లు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అమృత ఇచ్చిన లెటర్ కు రామ్ గోపాల్ వర్మ కూడా ఒక సందేశం ఇచ్చాడు.
Recommended Video

ఫస్ట్ లుక్ తోనే వైరల్..
అమృత అలాగే అతని తండ్రి మారుతి రావ్ క్యారెక్టర్స్ కి సంబంధించిన లుక్స్ తో వర్మ ఇటీవల పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మర్డర్: కుటుంబ కథా చిత్రం అంటూ ఇది నిజమైన కథ అనే హింట్ కూడా ఇచ్చాడు. పోస్టర్ చూడగానే ఆ సినిమా మిర్యాలగూడ పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు అందరికి అర్ధమయ్యింది.

స్పందించిన అమృత..
అయితే ఈ విషయంపై అమృత ఇటీవల ఒక లేఖను విడుదల చేసింది. ఆ కథ తన జీవితానికి సంబంధించినది కాదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే భర్తను తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నట్లు ఆమె ఒక లెటర్ విడుదల చేసింది. ఇలాంటి సమయంలో విషాదకరమైన ఘటనపై సినిమాలు చేయడం ఏమిటని ఆమె లేఖలో పేర్కొన్నారు.

వర్మ చివరి సందేశం..
సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అమృత లేదా మరెవరైనా కావచ్చు.. వారికి నా ఫైనల్ సందేశం ఇదే. విపరీతమైన బాధను అనుభవించిన వారి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఇక మర్డర్ సినిమాలో బాధను అనుభవించిన వారిని గౌరవంగా చూపించడమే జరుగుతుందని చిత్తశుద్ధితో జరిగిన పరిణామాలను సినిమాలో చూపించనున్నట్లు వర్మ వివరణ ఇచ్చారు

న్యూ పోస్టర్స్ కూడా..
అలాగే మర్డర్ సినిమాకు సంబంధించిన మరికొన్ని పోస్టర్స్ ని కూడా వర్మ రిలీజ్ చేశాడు. మారుతి విధించిన ప్రణాయమృత విషాద గాధ అంటూ వర్మ విభిన్న పోస్టర్లను రిలీజ్ చేశాడు. ఇక ప్రణయ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసిన వర్మ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాడు. మరోవైపు అమృత కూడా ఆర్జీవిపై ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











