నిఖిల్ ఎవడో నాకు తెలియదు.. వాళ్ళది బానిసత్వపు బతుకు: RGV సంచలన వ్యాఖ్యలు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటర్లు ఎలా ఇస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాధారణంగా ఏమి అనని వాళ్లపైనే ఊహించని విధంగా సెటైర్లు వేసే ఆర్జీవి ఇక తనపై కామెంట్స్ చేసిన వారిపై ఏ విధంగా స్పందిస్తాడో అందరికి తెలిసిందే. ఇక ఇటీవల హీరో నిఖిల్ అర్జీవిపై చేసిన ఘాటు వ్యాఖ్యలకు వర్మ డిఫరెంట్ స్టైల్ లో సమాధానం ఇచ్చాడు.

వైరల్ అవ్వాలని..
వర్మ ఏం చేసినా కూడా మీడియాలో సంచలనం అయ్యేలా చూస్తాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ మూవీగా తీసిన పవర్ స్టార్ కూడా అదే తరహాలో వైరల్ అవ్వాలని ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక కామెంట్ చేస్తూ..హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు.

ఎంత రెచ్చిపోతే..అంత ప్రమోషన్స్..
ఇక పవర్ స్టార్ అభిమానులు ఎంత రెచ్చిపోతే అంత ప్రమోషన్స్ అన్నట్లుగా వర్మ రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఇక ఇటీవల యువ హీరో నిఖిల్ వర్మపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఎక్కడా కూడా ఆర్జీవి పేరు కూడా తీయకుండా అభిమాన హీరోకు మద్దతు ఇచ్చాడు.

నిఖిల్ ట్వీట్ వైరల్
శిఖరాన్ని చూసి కుక్క ఎంత మోరిగినా..ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్థం అయ్యిందిగా అంటూ నిఖిల్ తన సోషల్ మీడియాలో ఎకౌంట్ లో అర్జీవిపై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు కూడా అతనికి మద్దతు ఇస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా నిఖిల్ ట్వీట్ కి 30వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

నిఖిల్ ఎవడో నాకు తెలియదు..
నిఖిల్ చేసిన కామెంట్స్ పై మొదటిసారి రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. రీసెంట్ గా ఒక న్యూల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నిఖిల్ ఎవరో కూడా తనకు తెలియదు అని వర్మ విభిన్నంగా స్పందించాడు. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉండేవాళ్ళంత ఒక భానిసత్వానికి చెందిన వాళ్ళు అంటూ సెటైర్స్ వేశారు.
Recommended Video

పవన్ కళ్యాణ్ కింద తొత్తులు
వర్మ మాట్లాడుతూ.. నిఖిల్ ఎవడో నాకు తెలియదు. నిఖిల్ కావచ్చు, కిఖిల్ కావచ్చు.. వాళ్లందరూ కూడా ఒకే కోవకు చెందినవాళ్లు. పవన్ కళ్యాణ్ కింద తొత్తులుగా ఉంటారు. ఇలా తొత్తుల్లా ఉంటే పవన్ కళ్యాణ్‌కు వీళ్లమీద ఎదో మంచి అభిప్రాయం వస్తుందని వీళ్ల ఆశ. బానిసత్వం బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన ఇది. నిఖిల్ ఒక పెద్ద స్టార్ అయ్యుండొచ్చు.. కానీ వాడు ఎవడో నాకు తెలీదు'' అని వర్మ ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











