For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Upendraతో వర్మ సినిమా.. అచ్చొచ్చిన ఆ బ్యాక్ డ్రాప్ లోనే.. మామూలుగా లేదుగా!

  |

  తెలుగులో రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు తనదైన శైలిలో కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతూ సినిమాల ట్రెండ్ మార్చిన ఆయన ఇప్పుడు కేవలం వివాదాస్పద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకుల మీద ఆయనకు ఆసక్తి తగ్గడంతో ఆయన నుంచి మంచి క్వాలిటీ సినిమాలు బయటకు రావడం లేదు. తాజాగా ఆయన ఒక సినిమా గురించి ప్రకటించి సంచలనం రేపారు. ఆ వివరాల్లోకి వెళితే

  శివతో వచ్చి

  శివతో వచ్చి

  1989లో నాగార్జున హీరోగా శివ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ మొదటి సినిమాతోనే తెలుగు సినిమా దిశ, దశ మార్చి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన క్షణ క్షణం, అంతం, రాత్రి, గాయం లాంటి సినిమాలు ఆయనలో టాలెంట్ ని బయట పెట్టాయని చెప్పచ్చు. ఆయన నుంచి చివరిగా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఏది అని అడిగితే వంగవీటి అని చెప్పక తప్పదు. ఆ తర్వాత దాదాపు పదికి పైగా సినిమాలు చేసిన అవన్నీ ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా తెలియని పరిస్థితి.

  మరో స్టార్ హీరోతో

  మరో స్టార్ హీరోతో

  అయితే ఇప్పుడు ఆయన ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు, ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. కన్నడ స్టార్ 'ఉపేంద్ర'. ఈరోజు ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పిన ఆర్జీవి.. త్వరలోనే ఆయనతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను చేస్తున్నట్టు ప్రకటన చేశారు. తమ కాంబినేషన్‌లో ఓ అదిరిపోయే సినిమా వస్తుంది అంటూ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే వస్తాయి అని కూడా రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

  అంతా విభిన్నం

  అంతా విభిన్నం

  నిజానికి ఉపేంద్ర సినిమాలు అన్నీ విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో ఎవరూ ఊహించని విధంగా భిన్న గెటప్స్ లో కనిపించడమే కాక సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చే విధంగా కూడా సినిమాలు చేస్తూ ఉంటాయి. అయితే చాలాకాలంగా ఉపేంద్ర సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన ఆయన మళ్ళీ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు.

  తెలుగులోనూ ఫేమస్

  తెలుగులోనూ ఫేమస్

  ప్రజల కోసం మనం అంటూ 2018లో 'ఉత్తమ ప్రజాకీయ పక్ష' అనే రాజకీయ పార్టీ ప్రారంభించి తాను పోటీ చేయకుండా పలువురు అభ్యర్థులను బరిలోకి దింపి సంచలనం రేపారు. ఇక ఆయన తెలుగులో. 'కన్యాదానం', 'ఉపేంద్ర' "ఒకే మాట, రా!, నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్నాఫ్‌ సత్యమూర్తి" వంటి తెలుగు చిత్రాల్లో హీరోగా, కీలక పాత్రల్లో నటించగా ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న 'ఘని'లోనూ ఉపేంద్ర కీ రోల్ లో కనిపించనున్నారు.

  వెయిటింగ్

  వెయిటింగ్

  ఇప్పటికే తనకు సరిపోయే సాలిడ్ స్క్రిప్ట్‌ కోసం ఆయన పని చేసేందుకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ ఆయనకు మంచి మాఫియా స్టోరీ చెప్పాడని అంటున్నారు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌ లో సినిమా వస్తుంది అని తెలియగానే అభిమానుల్లో ఉత్సహం రెట్టింపు అయింది. చూడాలి మరి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రానుంది అనేది.

  English summary
  sensational director Ram Gopal Varma announces A Movie with Upendra on his birthday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X