twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Family Man 2 : ఇండియన్ జేమ్స్ బాండ్ వచ్చేసింది.. ఆయనకు ఒక్కడికే సాధ్యం.. ఆకాశానికెత్తేసిన వర్మ

    |

    తెలుగు ప్రేక్షకులే కాక అన్ని భాషల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో గత ఏడాది నుంచి సినిమాలతో పాటు వెబ్ కంటెంట్ కి కూడా క్రేజ్ పెరుగుతోంది. దీంతో ది ఫ్యామిలీ మాన్ రెండో సీజన్ కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ వివరాల్లోకి వెళితే.

    దేశాన్ని రక్షించేలా

    దేశాన్ని రక్షించేలా

    ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అశేష ఆదరణ పొందుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి, గుల్ పనాగ్ లాంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన ఫ్యామిలీ మాన్ సీజన్ వన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్ & డి.కె తెరకెక్కించిన ఈ రెండు భాగాల సిరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది.. తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తున్న శ్రీకాంత్(మనోజ్ బాజ్పాయ్) చేసే సాహసాలే నేపథ్యంగా ఈ సిరీస్ తెరకెక్కించారు.

    లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా

    లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా

    మొదటి సిరీస్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ దీనికి కొనసాగింపుగా రెండో సిరీస్ కూడా రూపొందించారు.. నిజానికి ఈ సిరీస్ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అప్పటికే రిలీజయిన తాండవ్, అలాగే మీర్జాపూర్ వెబ్ సిరీస్ కి సంబంధించి అనేక వివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ రిలీజ్ వాయిదా వేసింది. ఎట్టకేలకు ఈ సిరీస్ జూన్ 4వ తేదీ నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

    వర్మ కూడా లిస్టులో

    వర్మ కూడా లిస్టులో

    ఈ సిరీస్ రిలీజ్ అయినప్పటి నుంచి సిరీస్ మీద ప్రసంశల వర్షం కురుస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాక సినిమా ఇండస్ట్రీ వారు సైతం సిరీస్ బాగుందని చెబుతూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే అలా చాలా మంది సెలబ్రిటీలు ఈ సిరీస్ బాగుందని ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఆ లిస్టు లో రామ్ గోపాల్ వర్మ కూడా చేరాడు.

    మనోజ్ మీద ప్రసంశలు

    మనోజ్ మీద ప్రసంశలు

    'ది ఫ్యామిలీ మ్యాన్ 2' జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ మాదిరిగా ఎప్పటికీ సాగిపోతూనే ఉంటుందని వర్మ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్ మిక్స్ చేయడం చాలా కష్టమని, కానీ ఇంక్రెడిబుల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ ఇందుకు న్యాయం చేశాడని ఆయన ప్రశంసించాడు. రియలిస్టిక్, డ్రామాటిక్ మధ్య తేడాను చాలా చక్కగా చూపగలిగాడని మనోజ్ ను ప్రశంసించాడు.

    వేర్ ఈజ్ సమంత

    వేర్ ఈజ్ సమంత

    అయితే వర్మ కామెంట్స్ కి స్పందించిన మనోజ్ బాజ్‌పాయ్.. వర్మ ట్వీట్ తనకు అవార్డు లాంటిదని చెబుతూ దానిని రీట్వీట్ చేశాడు. అయితే మరోవైపు తమిళనాడు నేతలు, సహా కొంతమంది జనం కూడా తమ వాళ్ళని అందరినీ అవమానించేలా ది ఫ్యామిలీ మాన్ 2 ఉందని కామెంట్ చేస్తున్నారు. తమిళ, దర్శక నటుడు భారతీరాజా, నటుడు మనోబాల సైతం ఈ సిరీస్ మీద ఫైర్ అయ్యారు. ఇక ఇంతకీ వర్మ సమంత గురించి మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

    English summary
    Ram Gopal Varma Applauses manoj bajpayee for The Family Man 2. he took his twitter handle and stated''FAMILY MAN 2 gives rise to a realistic James Bond franchise which can go on forever .Mixing family drama/action/entertainment is complex and can only be pulled off by an incredible actor like manoj as he treads the very fine line between realistic and dramatic;
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X