మాటల్లేకుండా ట్రైలర్.. బీచ్ లో హాట్ రొమాన్స్.. బ్యూటీఫుల్ గా ఆర్జీవీ మార్క్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా నిర్మించిన చిత్రం బ్యూటీఫుల్. ఒకప్పటి క్లాసిక్ మూవీ రంగీలాకు కొనసాగింపులా అనిపిస్తోన్న బ్యూటీఫుల్ మూవీ ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
బీచ్లో హాట్ రొమాన్స్ చేస్తూ ఉన్న హీరోహీరోయిన్ల ఫోటోలను విడుదల చేసిన సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాడు. రంగీలా కథలా అనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా పెట్టకుండా భావాన్ని అర్థమయ్యేలా చేశాడు.

ఒక పేద అమ్మాయి, అబ్బాయి ప్రేమలో ఉంటారు.. ఆ సమయంలో అంతా హ్యాపీగా గడుస్తూ ఉంటుంది.. అయితే అనుకోకుండా ఓ ఘటన జరిగి ఆ అమ్మాయి పెద్ద ధనవంతురాలువుతుంది.. ఇక అప్పటి నుంచి కష్టాలు మొదలవుతాయి.. డబ్బెప్పుడూ అందంగా ఉండదంటూ ముగించేయడం హైలెట్ గా ఉంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో సహాయ దర్శకుడిగా చేసిన అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఫోటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వహించాడు. ఈ సినిమాలో పార్థ సూరి, నైనా గంగూలీలు నటించగా.. టీ నరేష్, టీ శ్రీధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రవి శంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ట్రైలర్ ను పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











