Just In
- 25 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 50 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 55 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 1 hr ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాంగోపాల్ వర్మ ఇక తాత.. బిడ్డకు జన్మనిచ్చిన ఆర్జీవి కూతురు.. ట్వీట్‌తో ఆటపట్టించిన రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాత అయ్యారు. తన కూతురు రేవతి ఓ పండంటి పాపకు జన్మనిచ్చారు. బంధాలు, అనుబంధాలకు రాంగోపాల్ వర్మ దూరంగా ఉండటం తెలిసిందే. అయితే తాత కావడంతో సినీ ప్రముఖులు కొందరు అభినందనలు తెలుపగా, మరొకొందరు సోషల్ మీడియాలో ఆట పట్టించే విధంగా కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకు జక్కన ఏమని ఆట పట్టించారంటే..

2013లో కూతురు పెళ్లి చేసిన ఆర్జీవి
కొద్దికాలం క్రితం రాంగోపాల్ వర్మ తన కూతురు రేవతి వివాహం 2013లో ప్రణవ్ అనే ఎన్నారైతో జరిపించారు. అప్పటి నుంచి రేవతి దంపతులు అమెరికాలో ఉంటున్నారు. ప్రస్తుతం రేవతి అమెరికాలో ఆడపిల్లకు జన్మనిచ్చారు. తల్లి, కూతురు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

వర్మ కుటుంబం ఆనందం
తన కూతురు రేవతి అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఆడపిల్లకు జన్మినిచ్చిన వార్తతో రాంగోపాల్ వర్మ కుటుంబంలో ఆనందం నెలకొన్నది. ఈ క్రమంలో ఆర్జీవిని సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకొనే ఆర్జీవి మాత్రం ఇప్పటికి పెదవి విప్పడం లేదు.

ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్
ఆర్జీవి తాత అయిన విషయాన్ని దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఆసక్తికరమైన ట్వీట్‌ను కూడా చేశారు. కంగ్రాట్స్ రాము తాతయ్య గారు. ఇక మీ మనవరాలు నీకు కళ్లెం వస్తుందని అనుకొంటున్నాను. సరేగానీ నిన్ను ఎలా పిలువాలి.. రాము తాత అనా లేక రాము నాన్న లేదా గ్రాండ్‌పా రాము అని పిలువాలా అంటూ ట్వీట్ చేశారు. జక్కన ట్వీట్‌కు రాం గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

వివాదాలకు కేంద్ర బిందువుగా
ఇక రాంగోపాల్ వర్మ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల తీసిన ఆఫీసర్, భైరవ గీత, కమ్మరాజ్యంలో కడప బిడ్డలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమాపై దృష్టిపెట్టారు. మరో హిందీ సినిమాను కూడా రూపొందిస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి వివాదాస్పద చిత్రంతో ఆర్జీవి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు.