For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV అత్యుత్సాహం.. మొదటిసారి చెంప చెళ్లుమనిపించిన హాట్ బ్యూటీ, ఎవరైతే నాకేంటి అంటూ..

  |

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ఏం మాట్లాడినా కూడా అది ఒక కాంట్రవర్సీ గా మారడం కాయం. అలాగే ఫొటోలు ప్రోమోలు విడుదల చేసిన కూడా వైరల్ అవుతుండడం కామన్ గా వస్తున్నదే. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటాడు. పబ్లిసిటీని ఎక్కువగా ఇష్టపడే వర్మ ఈ మధ్యకాలంలో ఆ డోసును మరింత పెంచాడు. అమ్మాయిలతో డాన్స్ వేసుకుంటూ బోల్డ్ గా ఇంటర్వ్యూలు చేసుకుంటూ సరికొత్త షాక్ ఇస్తున్నాడు. అసలు గతంలో చూసిన రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు చూస్తున్న రామ్ గోపాల్ వర్మకు ఏమాత్రం సంబంధం లేదని చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక గ్లామర్ బ్యూటీపై ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేయడంతో ఆమె చెంప మనిపించింది. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా వర్మ తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశాడు.

  తనకు నచ్చినట్లుగానే..

  తనకు నచ్చినట్లుగానే..

  ఒకప్పుడు శివ, రంగీలా, సత్య, సర్కార్, బూత్ వంటి ఎన్నో విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం ఎవరూ ఊహించని దారిలో అడుగులు వేస్తున్నాడు. సినిమాలకంటే కూడా అమ్మాయిల ఇంటర్వ్యూలు అంటూ చాలా బిజీగా మారిపోతున్నాడు. ఆయన అభిమానులు కొందరు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మరికొందరు మాత్రం వర్మ తరహాలోనే నచ్చినట్లుగా బ్రతకాలని అంటున్నారు. ఇక ఎవరు ఎన్ని కామెంట్ చేసినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా వర్మ తనకు నచ్చినట్లుగానే కొనసాగుతున్నాడు.

  ఇదివరకే అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ

  ఇదివరకే అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ

  రీసెంట్ గా కొంతమంది గ్లామరస్ బ్యూటీలను ప్రత్యేకంగా కలుసుకుంటూ వారి పేర్లను కూడా వైరల్ అయ్యేలా చేస్తున్నాడు. ఆ మధ్య వర్కౌట్స్ చేస్తూ జిమ్ లోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానాతో ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఆమెను చాలా ఓపెన్ గా బోల్డ్ గా ప్రశ్నలు అడుగుతూ ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యేలా చేశాడు. మొదట అరియానా రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొంత మంది కూడా వర్మతో కొనసాగుతూ ఆయన క్రేజ్ ను యూజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

  అషు రెడ్డితో కూడా బోల్డ్ గా..

  అషు రెడ్డితో కూడా బోల్డ్ గా..

  ఇక మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి అషు రెడ్డి కూడా వర్మతో ఎక్కువగా ట్రావెల్ అవుతున్నట్లు తెలుస్తోంది రీసెంట్ గా వర్మ ఆమెకు సంబంధించిన హాట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. బ్యూటిఫుల్ గర్ల్స్ ను ఎక్కువగా లైక్ చేసే వర్మ అదే తరహాలో అషు రెడ్డి హాట్ థైస్ అంటూ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యేలా చేశాడు. ఇక ఇప్పుడు మరొక స్పెషల్ వీడియోను కూడా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు.

   నువ్వు ఎవరైతే నాకేంటి..

  నువ్వు ఎవరైతే నాకేంటి..

  ఒక కాఫీ షాప్ లో అషు రెడ్డి కూర్చుని ఉండగా అక్కడికి వెళ్ళిన రామ్ గోపాల్ వర్మ ఆమెను ఎట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే వర్మ ఎవరూ తెలియనట్టుగానే ఉన్న అషు రెడ్డి తన భావాన్ని వ్యక్త పరిచింది. తను రామ్ గోపాల్ వర్మ అని చెప్పినప్పటికీ కూడా నువ్వు ఎవరైతే నాకేంటి అని చాలా స్టైల్ గా బోల్డ్ గా సమాధానం ఇస్తుంది. ఇక వర్మ ఎప్పటిలానే తనలోని రొమాంటిక్ యాంగిల్ ను బయటకు పెట్టాడు.

  వర్మ చెంప పగలగొట్టేసింది

  వర్మ చెంప పగలగొట్టేసింది

  మీ థైస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఐ లవ్ యువర్ థైస్ అంటూ కామెంట్ చేయడంతో అశోక్ రెడ్డి ఏమాత్రం ఆలోచించకుండా వర్మ చెంప చెల్లు మనిపిస్తుంది. ఇప్పటి వరకు వరకు వర్మ అయితే ఎవరి చేతిలో కూడా దెబ్బలు తినలేదు అని చెప్పాడు. ఇక ఇప్పుడు అషు రెడ్డి దెబ్బ కొట్టడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అయింది. రామ్ గోపాల్ వర్మ ఆమెతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ బోల్డ్ టాకింగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఫుల్ వీడియో వచ్చే వరకు ఆగాల్సిందే.

  పవన్ కళ్యాణ్ గురించి కూడా

  పవన్ కళ్యాణ్ గురించి కూడా

  అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అషు రెడ్డి తన నడుము దగ్గర పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకొని అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక వర్మ ఆ విషయం గురించి కూడా ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇక ఫుల్ వీడియో సెప్టెంబర్ 7న సాయంత్రం 6గంటలకు రిలీజ్ కానుందని క్లారిటీ ఇచ్చారు.

  Pawan Kalyan రాజ్యాన్ని ఏలడానికి 6 సూత్రాలు | Bheemla Nayak || Filmibeat Telugu
  English summary
  Ram gopal varma bold interview with ashu reddy promo viral,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X