For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV పనే బావుంది.. ఏకంగా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్.. ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడుతూ!

  |

  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటి పని చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు సినిమాలతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన వర్మ ఇప్పుడు మాత్రం గ్లామర్ బ్యూటీ లతో ఎక్కువగా దర్శనమిస్తున్నాడు. ప్రతినిత్యం ఏదో ఒక బోల్డ్ కంటెంట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. కొంతమంది బ్యూటీలకు వర్మ క్రేజ్ కూడా బాగానే ఉపయోగపడుతుంది. అరియానా ఒకే ఒక్క ఇంటర్వ్యూతో బిగ్ బాస్ నుంచి నుంచి ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత అప్సర రాణి అలాగే ప్రస్తుతం అషు రెడ్డి కూడా వర్మ దారిలోనే క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  ఎన్నో విభిన్నమైన సినిమాలు

  ఎన్నో విభిన్నమైన సినిమాలు

  గత ఐదేళ్ల క్రితం వరకు కూడా రాంగోపాల్ వర్మ ఇలాంటి సినిమాలు చేసేవారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శివ, సత్య సర్కార్, కంపెనీ వంటి ఎన్నో సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన రాంగోపాల్ వర్మ ఆ తర్వాత మెల్లగా బయోపిక్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా సీరియస్ థ్రిల్లర్ హారర్ క్రైమ్ వంటి ఎన్నో విభిన్నమైన జనార్స్ టచ్ చేశాడు. వర్మ ఏలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో ఒక ప్రత్యేకమైన హైప్ క్రియేట్ అవుతూ వచ్చేది.

   థైస్ ను ముద్దాడుతూ..

  థైస్ ను ముద్దాడుతూ..

  RGV జనాలోకి తన సినిమాను ఎలా తీసుకువెళతాడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పబ్లిసిటీ అంటే తనకు ఎంతో ఇష్టమని ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చిన ఈ దర్శకుడు ఆ దారిలోనే మంచి బిజినెస్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఒకప్పుడు తన సినిమాలతో సక్సెస్ ఇచ్చి గ్లామర్ బ్యూటీలకి ఒక రూట్ సెట్ చేసేవారు. ఇక రీసెంట్ గా ఒక హీరోయిన్ థైస్ ను ముద్దాడుతూ సరికొత్తగా షాక్ ఇచ్చాడు.

  రొమాంటిక్ లైఫ్

  రొమాంటిక్ లైఫ్

  ఇక సినిమాలను చాలావరకు తగ్గించేసిన రాంగోపాల్ వర్మ ప్రస్తుతం మాత్రం గ్లామర్ బ్యూటీ లతో రొమాంటిక్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రజెంట్ చేసుకుంటున్నాడు. రెగ్యులర్ గా కాకుండా గ్లామరస్ యాంకర్స్ తో కూడా బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శృంగార జీవితానికి సంబంధించిన అంశాలను ఎక్కువగా హైలెట్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల అషు రెడ్డి తో చేసిన ఇంటర్వ్యూలో వర్మ తన రొమాంటిక్ లైఫ్ గురించి చాలా ఓపెన్ గా వివరణ ఇచ్చాడు.

   ఇద్దరి మధ్యలో కోతిలాగా

  ఇద్దరి మధ్యలో కోతిలాగా

  ఇక ప్రస్తుతం మరొక గ్లామరస్ బ్యూటీతో వర్మ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. గ్లామరస్ హీరోయిన్ సోనియాతో వర్మ ఇటీవల ఒక క్లబ్ లో సరదాగా గడిపినట్లు ట్వీట్ చేశాడు. ఆమెతోపాటు మరో గ్లామరస్ బ్యూటీ కూడా పక్కనే ఉంది. ఇద్దరి మధ్యలో కోతి అంటూ వారికి సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఒక విధంగా వారిని వర్మ ప్రమోట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

  లోకేషన్ కూడా షేర్ చేస్తూ..

  లోకేషన్ కూడా షేర్ చేస్తూ..

  వర్మ కేవలం ఫోటోలు మాత్రమే షేర్ చేయకుండా మంకీ అనే క్లబ్బుకు సంబంధించిన లొకేషన్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తనతో జాయిన్ అవ్వండి అంటూ కాస్త బోల్డ్ గా ట్వీట్ కూడా చేశాడు. RGV గ్లామరస్ బ్యూటీ లతో స్టిల్ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. గత కొంతకాలంగా వర్మ ఇలాంటి లైఫ్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడని అనిపిస్తున్నట్లు నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

  Happy Days Fame Rahul Haridas Signs A Thriller Film
  వర్మ పనే బావుంది..

  వర్మ పనే బావుంది..

  ఇక సోషల్ మీడియాలో వర్మ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు కొంతవరకు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. వర్మ పని బాగుంది అంటూ పుడితే నీలాగా ధైర్యంగా స్వేచ్ఛగా బ్రతకాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కంటే వర్మకు ఇటీవల కాలంలో ఓ వర్గం అభిమానుల సంఖ్య ఎక్కువగానే అయింది.ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది దర్శకులు మాత్రం మళ్లీ పాత వర్మ ను చూసేలా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు తేవాలని కోరుకుంటున్నారు. కానీ వర్మ మాత్రం తనకు నచ్చినట్లుగా సినిమాలు చేసుకుంటూ ఇష్టమున్న రొమాంటిక్ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక భవిష్యత్తులో వర్మ వేసే అడుగులు ఇంకా ఎలా ఉంటాయో చూడాలి.

  English summary
  Ram gopal varma busy with glamorous beauties in night parties,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X