For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్, చంద్రబాబు, లోకేష్ అంటే చాలా ఇష్టం.. దేవుడి మీద ఒట్టు.. జనసైనికులను కెలికిన ఆర్జీవీ

  |

  వీడి చర్యలు ఊహాతీతం అని త్రివ్రికమ్ ఏ ముహుర్తాన డైలాగ్ రాశాడో గానీ.. అది రామ్ గోపాల్ వర్మకు కరెక్ట్‌గా సరిపోతుంది. వర్మను తమ ఇన్స్పిరేషన్‌గా తీసుకునే వారు కొందరైతే.. బూతులు తిట్టేవారు మరికొందరు. తనపై రాళ్లు రువ్వినా, పూలు చల్లినా ఒకేలా తీసుకునే వర్మ.. ఎప్పటికీ ఎవరికీ అర్థం కాడు. వర్మ చిత్రాలు విజయం సాధించి ఎన్నో యేళ్లు అవుతున్నాయి. అయితే వర్మ ఎంత చెత్త సినిమా తీసినా దానికి పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో ఉంటుంది.

  సంచలనాలు సృష్టించిన అమ్మ రాజ్యంలో..

  సంచలనాలు సృష్టించిన అమ్మ రాజ్యంలో..

  ఏపీ పాలిటిక్స్, రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సెటైరికల్‌గా తీసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం అనేక వివాదాల్లో చిక్కుకుంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ వంటి వారిని పోలిన నటీనటులను పెట్టి.. చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఇది అనేక మార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు గత గురు వారం విడుదలైంది.

  సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు..

  సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు..

  ఈ మూవీ సెన్సార్ బోర్డ్, రివిజన్ కమిటీ, హైకోర్టు మధ్య నలిగిపోయింది. సెన్సార్ సభ్యులు చేతులెత్తేయగా..రివైజింగ్ కమిటీ కొన్ని సీన్లను, మాటలను నో చెప్పేసింది. టైటిల్ సైతం మార్చాలని ఆదేశించింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని మార్చేశాడు. మొత్తానికి అన్ని సమస్యలను దాటుకుని మూవీ రిలీజ్ అయింది.

  ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' మూవీలో పవన్ కళ్యాణ్‌ను కించపరిచినట్టు చూపించాడని ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలు.. మూవీ రిలీజ్ రోజు అనగా డిసెంబర్ 12న వర్మ చనిపోయాడని.. డిసెంబర్ 26న ఆయన పెద కర్మ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని, నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూరకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తూ జనసేన యూత్- కోడూరు పాడు అంటూ భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. అందులో జోహార్ బాస్టర్డ్ అంటూ వర్మపై నిప్పులు చెరిగారు కార్యకర్తలు.

  దేవుడి మీద ఒట్టు..

  దేవుడి మీద ఒట్టు..

  ఇలాంటి విష‌యాల‌ని లైట్ తీసుకుని వాటిని కూడా పబ్లిసిటీ అని ఎంజాయ్ చేసే వర్మ.. అదిరిపోయే సెటైర్ వేశాడు. ఫ్లెక్సీని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుపై దుష్ప్రచారాన్ని చేస్తోన్న పవన్ కళ్యాణ్ పీఆర్ఓ, సీబీఎన్ పీఆర్ఓ, లోకేష్ పీఆర్ఓ, నాకు వ్యతిరేకంగా ఉండేవారికి చెబుతున్నా.. దయచేసి అర్ధం చేసుకోండి.. ఈ సినిమా జస్ట్ ఫన్ కోసం మాత్రమే తీశా. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా.. నేను నిజానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబులను ప్రేమిస్తున్నా. వాళ్ల ఫాలోవర్స్ మీద ఒట్టు.. ముఖ్యంగా కోడూరుపాడు జనసేన ఫాలోవర్స్‌ మీద ఒట్టేసి చెబుతున్నా నమ్మండి' అంటూ వాళ్ళ‌ని మళ్లీ కెలికాడు వర్మ.

  English summary
  Ram Gopal Varma Cold War With Pawan Kalyan And Janasena followers. RGv Is Trolled By Janasena Followers for Amma Rajyamlo Kadapa Biddalu. Rgv Also Given Punch To Them. This Cold War Goes Viral On Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X