సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని అందరూ మరిచిపోయారు.. బయోపిక్‌పై ఆర్జీవి హాట్ కామెంట్
వివాదం ఎక్కడుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ అక్కడే ఉంటారనేది అందరికి తెలిసిందే. బాలీవుడ్‌లో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అత్యంత వివాదంగా మారింది. అయితే సుశాంత్ జీవితంలో చోటుచేసుకొన్న ముఖ్య సంఘటనల ఆధారంగా బయోపిక్ తీస్తున్నారనే వార్తలపై ఆర్జీవి స్పందించారు.
ఈ సందర్భంగా ఆర్జీవి స్పందిస్తూ.. సుశాంత్ డెత్ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. అందరూ అతడి మరణాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. అంతేకాకుండా ఆయన కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తికి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో సర్కస్ జరుగుతున్నది. చాలా మంది రెగ్యులర్‌గా ట్రెండ్ చేస్తూ తమాషాగా మార్చారు అని వర్మ పేర్కొన్నారు.

అయితే సుశాంత్ గురించి బయోపిక్ తీస్తానో లేదో నాకు తెలియదు. ఇప్పటికైతే ఆ వివాదం గురించి నేను పట్టించుకోవడం లేదు. ఒకవేళ నేను బయోపిక్ తీస్తే చాలా విషయాలను సేకరిస్తాను అని వర్మ చెప్పారు.
గతంలో సంచలన విజయాలను సినిమా ఇండస్ట్రీకి అందించిన వర్మ ఇటీవలే తన జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు నా జన్మదిన కాదు. డెత్ డే అంటూ ట్వీట్ చేశారు. ఎందుకంటే నా జీవితంలో ఓ సంవత్సరం చచ్చిపోయింది అంటూ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











