India Pak War: కామన్ సెన్స్ లేదా? ట్రంప్ ట్వీట్‌పై ఆర్జీవి షాకింగ్ కామెంట్
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం సంఘటన తర్వాత భారత, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకొన్నాయి. పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఇటీవల భారత్ చేసిన మెరుపుదాడులతో పరిస్థితి మరింత భీకరంగా మారింది. ఇరు దేశాల పరస్పరం దాడులు చేసుకోవడం కనిపించింది. పాక్ దాడులను భారత సేనలు గట్టిగా తిప్పి కొట్టడంతో ప్రత్యర్థి సేనలు బెంబెలెత్తాయి. దాంతో కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ట్వీట్‌పై ఆర్జీవీ చేసిన కామెంట్ వైరల్ అయింది. ఈ కామెంట్ వివరాల్లోకి వెళితే..
విక్రమ్ మిస్త్రీ వివరణ
భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం సాయంత్రం విదేశాంగ శాఖ మంత్రి విక్రమ్ మిస్త్రీ మీడియా సమావేశం నిర్వహించి.. ఇరుదేశాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య డైరెక్టర్ జనరల్ ఆప్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఇక నుంచి భూ, గగన సముద్ర తలాల మధ్య కాల్పుల విరమణ జరుగుతుంది అని విషయాన్ని వెల్లడించారు.

డొనాల్డ్ ట్రంప్ ట్వీట్
ఇక ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్దంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇరు దేశాల అధికారులతో రాత్రంతా జరిపిన చర్చలు, అమెరికా మధ్యవర్తిత్వంతో సానుకూలత లభించింది. భారత, పాక్ దేశాలు పూర్తిస్థాయిలో, త్వరితగతిన కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయి. గ్రేట్ ఇంటెలిజెన్స్, కామన్ సెన్స్ ఉపయోగించినందుకు ఇరుదేశాలకు కంగ్రాట్స్. ఈ విషయంపై అటెన్షన్ పెట్టినందుకు థ్యాంక్స్ అని ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ట్రంప్ ట్వీట్‌పై ఆర్జీవి సెటైర్
అయితే ట్రంప్ ట్వీట్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మీరు వచ్చి మాకు చెప్పేంత వరకు, మమల్ని ఎడ్యుకేట్ చేసేంత వరకు మాకు కామన్ సెన్స్ లేదా? ఇంటెలిజెన్స్ లేదా? అని ఆర్జీవి కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై రకరకాల చర్చ జరుగుతున్నది.
ట్రంప్ ట్వీట్‌పై నెటిజన్ల రియాక్షన్
అయితే ట్రంప్ ట్వీట్‌పై ఆర్జీవి చేసిన కామెంట్‌పై నెటిజన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్జీవి వివరించినట్టు ఎవరూ చెప్పలేరు అని నెటిజన్ కామెంట్ చేశాడు. ట్రంప్ ఓ వ్యాపారి. తన బ్రాండ్స్ అమ్ముకోవడమే ఆయన పని. భారత్, పాక్ యుద్ధంలో అతను చేస్తున్న పని అదే. మనం ఈ విషయాన్ని గ్రహించి అందరికి తెలియచెప్పాలి అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాల్పుల విరమణ కోసం భారత్ ఎలాంటి షరతులు పెట్టకుండా ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. పీఓకేను ఆధీనం చేసుకొని పాక్‌కు గట్టిగా బుద్ది చెప్పే ఛాన్స్ మిస్ అయిందనే ఫీలింగ్ నాకు కలుగుతున్నది అని నెటిజన్ ఆలోచింపజేసే కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











