కేసీఆర్‌‌పై వర్మ కామెంట్స్.. ఇలియానాతో లింక్ చేస్తూ సెన్సేషన్!

సెన్సేషన్స్‌కి మారు పేరు రామ్ గోపాల్ వర్మ. ఎవ్వరి గురించి అయినా తాను చెప్పాలనుకున్నది ఓపెన్‌గా చెప్పేస్తుంటారు ఈ వివాదాస్పద దర్శకుడు. కేవలం సినిమాతోనే కాదు, పలు ఇంటర్వ్యూల్లో కాంట్రవర్సీగా మాట్లాడి సంచలనం క్రియేట్ చేయడం ఈయనకే చెల్లుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు వర్మ. ఆ వివరాలేంటో చూద్దామా..

రామ్ గోపాల్ వర్మ దూకుడు.. రాజాకీయాల్లో ప్రకంపనలు

రామ్ గోపాల్ వర్మ దూకుడు.. రాజాకీయాల్లో ప్రకంపనలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ రాజకీయాల్లో అలజడి సృష్టించిన వర్మ.. అదే బాటలో దూకుడుగా వెళ్తున్నారు. ఈ మేరకు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే మీరో సినిమాకు శ్రీకారం చుట్టి రాజాకీయాల్లో ప్రకంపనలు రేపారు. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కావడంతో ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూ‌లో పాల్గొంటున్న ఆయన.. కేసీఆర్‌పై కామెంట్స్ చేయడం సెన్సేషన్‌గా మారింది.

కేసీఆర్‌ అందగాడు అంటూనే..

కేసీఆర్‌ అందగాడు అంటూనే..

ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఇలియానా కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా అందగాడు అని చెప్పి ఒక్కసారిగా అందరికీ షాకిచ్చారు వర్మ. అంతేకాదు హీరోయిన్ ఇలియానాతో కేసీఆర్‌కు లింక్ పెడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఆశ్చర్యపరిచాయి. పైగా కేసీఆర్, ఇలియానా మ్యాటర్‌లో తనదైన లాజిక్ అప్లై చేశారు ఈ వివాదాస్పద వీరుడు.

ఇలియానాను అంత సేపు చూడగలమా? అదే కేసీఆర్ అయితే

ఇలియానాను అంత సేపు చూడగలమా? అదే కేసీఆర్ అయితే

కేసీఆర్ మాట్లాడుతుంటే గంట కాదు, ఎంతసేపు అయినా చూస్తుండి పోతానని.. ఆయన మాటలు, హావభావాలు రెప్ప వాల్చకుండా చూసేస్తుంటానని చెప్పాడు వర్మ. అదే ఇలియానాను అంత సేపు చూడటం సాధ్యమేనా? అంటూ తనదైన లాజిక్ బయటకు తీశారు వర్మ. దీంతో ఇదంతా చూసి వర్మ.. చెప్పిన దాంట్లో ఎంతోకొంత వాస్తవం ఉందిలే అని చెప్పుకుంటున్నారు నెటిజన్లు.

 అలాంటి వారూ ఉన్నారు.. కానీ వర్మ మాత్రం

అలాంటి వారూ ఉన్నారు.. కానీ వర్మ మాత్రం

ఎప్పుడెవరిపై బాంబ్ వేస్తాడో తెలియని వర్మ.. ఈ సారి కేసీఆర్ పేరెత్తడం ఆసక్తికరంగా మారింది. కాగా తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ప్రమోషన్స్ కోసం వర్మ వాడుతున్న చీప్ ట్రిక్స్ ఇవి అనే వారూ లేకపోలేదు. ఎవరేమన్నా.. వర్మ టాలెంట్ అనేదే వేరులే. ఇలా ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవాలన్నా.. టాలెంట్ ఉండాలిగా మరి!.

 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' కుదుపు

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' కుదుపు

ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినీ, రాజకీయ వర్గాలను ఓ కుదుపు కుదిపేశాయి. వర్మపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక నవంబర్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X