For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎయిర్ ఫోర్స్ వేస్కుని బైడెన్ బయల్దేరాడు..మిలట్రీని దించండి.. ఆయన కిడ్నాప్ అవకుండా చూడండి!

  |

  రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్రెండీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్, ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు ఆయన సినిమాలు అన్నీ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. అంతెందుకు ఒకప్పుడు వర్మ సినిమాల కోసం ఎదురు చూసిన వాళ్ళు సైతం అసలు వర్మ సినిమా వస్తుందంటే పట్టించుకోని పరిస్థితి. కొన్నేళ్లుగా వర్మ తన రేంజ్‌కు తగ్గట్లుగా ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. ఆ విషయం పక్కన పెడితే ఆయన తాజాగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఆనందయ్య గురించి హాట్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  #Krishnapatnam: Anandaiah కు Army Security | కిడ్నాప్ అవకుండా చూడండి - RGV || Oneindia Telugu
  కృష్ణపట్నం హాట్ టాపిక్

  కృష్ణపట్నం హాట్ టాపిక్


  దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కు చెందిన ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య మాత్రమే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. దానికి కారణం ఆయన ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనా రోగులను మళ్ళీ తిరిగి మామూలు వాళ్లను చేయడమే.

  భారీగా ప్రజలు

  భారీగా ప్రజలు


  దాదాపు వారం రోజుల నుంచి ఆయన ఇస్తున్న కరోనా ముందు పని చేస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే కాక దాదాపు చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రావడం మొదలుపెట్టారు. ఈ దెబ్బకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మందు కోసం వచ్చే వారిని కంట్రోల్ చేయడానికి వినియోగించాల్సి వస్తోంది.

  రంగంలోకి నిపుణులు

  రంగంలోకి నిపుణులు


  ఇక సీఎం దృష్టికి ఈ విషయం వెళ్ళడంతో ఐసీఎంఆర్ నిపుణులను రప్పిస్తున్నారు. దీంతో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా ముందుకు మరోసారి బ్రేక్ పడింది. శుక్రవారం అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి , మందు పంపిణీ కేంద్రానికి పోలీసులు చేరుకున్నారు. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి మ౦దు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

  అనుమతి లేదు

  అనుమతి లేదు

  అంతే కాక శనివారం నుంచి ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు మందు పంపిణీ లేదని చెబుతున్నారు. ఇక మందు కోసం ఎవరూ రావద్దని పోలీసులు చెబుతున్నారు. ఆనందయ్య ఇప్పుడు పోలీసులుల అదనపు భద్రతలో ఉన్నారు. మరో పక్క ఆనందయ్య మందుపై కృష్ణపట్నంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది.

  నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలా?

  నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలా?

  అయితే ఈ క్రమంలో ఆనందయ్య గురించి రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ అంశం మీద దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. తనదైన స్టయిల్‌లో సెటైర్లు వేశారు. వరుసగా ట్వీట్ల వర్షం కురిపించారు. ఫైజర్‌, మోడెర్నా వంటి మెడిసిన్‌ మాదిరిగా వారి మిశ్రమ నిష్పత్తిని పంచుకోని ఆనందయ్య ఫ్రీగా తన మందులు ఎందుకు పంపిణీ చేస్తున్నారు. ఆయనకు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలా? ఊరకనే అడుగున్నా` అంటూ ట్వీట్‌ చేశారు.

  వాళ్ళు కిడ్నాప్ చేయకుండా చూడండి

  వాళ్ళు కిడ్నాప్ చేయకుండా చూడండి


  అనంతరం `జో బిడెన్‌, డాక్టర్‌ ఫౌసీ కృష్ణపట్నం ఎయిర్‌ ఫోర్స్ లో వెళ్తున్నారని విన్నానన్న ఆయన ఆనందయ్యతో కరోనా మందు విషయంలో ఒక ఒప్పందం జరగాలని కోరుతున్నానని అన్నారు. అదే సమయంలో ఆనందయ్యని మాత్రం వాళ్ళు కిడ్నాప్ చేయకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఆనందయ్యని జాతీయ నిధిగా ప్రకటించి అతనికి సైనిక భద్రత ఇవ్వకూడదా?` అంటూ ఆయన ట్వీట్లు చేశారు.

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే


  ఇక సినిమాల విషయానికి వస్తే వర్మ ఈ మధ్య కాలంలో దెయ్యం అనే సినిమా రిలీజ్ చేశాడు. స్వాతి దీక్షిత్, రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా సరే ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేక పోయింది.. దాదాపు 2,3 ఏళ్ల క్రితం సినిమాను ఇప్పుడు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఇక తాజాగా ఆయన నుంచి డీ కంపెనీ సినిమాకు సంబంధించిన మొదటి భాగం రిలీజ్ చేశారు. అది మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

  English summary
  Known for controversial statements, RGV has made a sensational comments on krishnapatnam anandayya. anandayya, who came into limelight for making ayurveda medicine for corona.recently RGV made some comments on anandayya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X