పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేసి దుమారం రేపిన వర్మ.. శ్రీదేవి కంటే మీరే అంటూ సెటైర్స్

వివాదాస్పద వీరుడు రామ్‌ గోపాల్‌ వర్మ దుమారం రేపాడు. పవన్ కళ్యాణ్ పేరు చెబుతూ ఆయనకు క్షమాపణలు చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మరోసారి తనలోని విలక్షణతను బయటకు తీసిన వర్మ.. పవర్ స్టార్‌ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

 రాజకీయాల్లో సంచలనం.. వర్మ కొత్త రూపం

రాజకీయాల్లో సంచలనం.. వర్మ కొత్త రూపం

ఇటీవలే 'అమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి తన అవతారాన్ని మార్చేశాడు. తన శిష్యుడిని దర్శకుడిగా పెట్టి నిర్మాతగా మారాడు. ఈ మేరకు తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ పార్టీలో పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేశాడు.

న్యూ ఇయర్ పార్టీ.. పవన్‌ని ఉద్దేశిస్తూ

న్యూ ఇయర్ పార్టీ.. పవన్‌ని ఉద్దేశిస్తూ

రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బ్యూటిఫుల్‌'. నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించింది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే న్యూ ఇయర్ పార్టీ అరేంజ్ చేశాడు వర్మ. ఈ కార్యక్రమంలో వర్మ పవన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు ఈ వివాదాస్పద దర్శకుడు.

క్షమాపణలు కోరిన వర్మ

క్షమాపణలు కోరిన వర్మ

గతంలో పవన్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్షమాపణలు కోరాడు వర్మ. ఈ రోజు తన మనసులోని మాటలు చెప్పాలనుకుంటున్నా అని పేర్కొంటూ పవన్‌ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. ''పవన్‌ గారికి తిక్కుంది.. నాకు లెక్కుంది. కానీ లెక్కకన్నా.. తిక్కే అందరికీ నచ్చుతుంది. అందుకే ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారు'' అన్నాడు వర్మ.

 సెటైరికల్ డైలాగులు కొట్టి.. హాట్ టాపిక్

సెటైరికల్ డైలాగులు కొట్టి.. హాట్ టాపిక్

అంతటితో ఆగక.. ''నన్ను క్షమించండి పవన్‌ గారు. ప్రమాణం చేసి చెబుతున్నా.. నాకు శ్రీదేవి కంటే పవన్‌ అంటేనే ఇష్టం. నేను దేవుడ్ని నమ్మను. మీరు నా మాటలు నమ్మకపోతే నేనేం చేయలేను'' అంటూ తనదైన స్టైల్‌లో సెటైరికల్ డైలాగులు కొట్టి విషయాన్ని హాట్ టాపిక్ చేసేశాడు. దీంతో ఈ ఇష్యూ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వర్మ ఎంత సొమ్ము చేసుకుంటాడో

వర్మ ఎంత సొమ్ము చేసుకుంటాడో

‘ఒక మహిళ తనకన్నా సక్సెస్‌ఫుల్‌ అయితే పురుషుడు భరించగలడా?' అనే కథాంశంతో ‘బ్యూటిఫుల్‌' చిత్రాన్ని తీసినట్లు వర్మ పేర్కొన్నాడు. చూడాలి మరి ఈ ‘బ్యూటిఫుల్‌' ద్వారా వర్మ ఎంత సొమ్ము చేసుకుంటాడో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X