Adipurush థియేటర్‌లో ఆంజనేయ స్వామికి సీటు.. రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు. ఆర్జీవి ఏమన్నారంటే?

రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి భారీ క్రేజ్ కనిపిస్తున్నది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో అనూహ్యమైన రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా విషయంలో సంచలన విషయాలు నమోదు అవుతున్నాయి. అయితే ఇలాంటి క్రేజ్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పదంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

ఇక ఆదిపురుష్ సినిమా టికెట్లను తీసుకొనేందుకు, సినిమా ప్రదర్శించే థియేటర్లకు ఎడ్లబండ్లు, వాహనాలపై ఊరేగింపులు తీస్తున్నారు. ఆధ్యాత్మిక యాత్రలు చేపడుతూ ఈ సినిమాపై అభిమానం చాటుతున్నారు. ఉత్తర భారత్‌లో, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తు్నాయి.

వాల్మికీ రామాయణం ఆధారంగా పౌరాణిక చిత్రంగా రూపొందిన ఆదిపురుష్ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమాను ప్రేక్షకులకు, పేదలు, వికలాంగులకు, వృద్ధులకు చూపించడానికి సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఉచితంగా టికెట్లను అందించడానికి మంచు మనోజ్, శ్రేయాస్ మీడియా, ఇతర సంస్థలు ఉచితంగా టికెట్లను అందించేందుకు సిద్దమయ్యాయి.

అయితే పౌరాణిక నేపథ్యంగా రాముడి జీవిత చరిత్రను తెరపైన చూపిస్తున్న నేపథ్యంలో ఆదిపురుష్ దర్శక, నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. భగవంతుడిపై సెంటిమెంట్‌ను సినిమాపై చూపించేందుకు సిద్దమయ్యారు. రాముడి చిత్రం కనుక హనుమంతుడు థియేటర్‌కు వస్తారనే ఆధ్యాత్మిక భావనతో ఆంజనేయ స్వామికి ఓ సీటును రిజర్వు చేయడం విశేషంగా మారింది.

Ram Gopal Varma controversial comments on Adipurush

ఉచితంగా టికెట్లు అందించడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. ప్రభాస్ ఇండియాలోనే సూపర్ స్టార్. ఆయన నటించిన సినిమాకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక పౌరాణిక నేపథ్యంలో కావడంతో ఇంకా క్రేజ్ ఎక్కువగా ఉంది. ఇలాంటి సినిమాకు ఉచితంగా టికెట్లు అందిస్తే.. తమకు కూడా క్రేజ్ వస్తుందని కొందరు సెలబ్రీటలు ప్రయత్నిస్తున్నారు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

ఇక ఆంజనేయస్వామికి టికెట్ రిజర్వు చేయడంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. సూపర్ స్టుపిడ్. ఆంజనేయ స్వామికి టికెట్ రిజర్వు చేయడం చూస్తే నాకు అర్ధం కావడం లేదు. ఆంజనేయస్వామిని అవమానించినట్టే. ఆయన కావాలనుకొంటే థియేటర్‌ను సంజీవిని పర్వతంలా ఎత్తుకెళ్లే సత్తా హనుమంతుడికి ఉంది. ఆయనకు సీట్ ఎందుకు అని వర్మ సెటైర్ వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X