twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీచర్స్ డే రోజున వర్మ వివాదాస్పద ట్వీట్.. వాళ్లంతా ఫెయిల్ అంటూ మరో బాంబ్

    |

    Recommended Video

    Ram Gopal Varma's Controversial Tweets On Teachers Day !

    భారతదేశంలోనే సంచలన దర్శకుడిగా పేరొందాడు రాంగోపాల్ వర్మ. దీనికి కారణం కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న హడావిడే. గతంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేసిన ఈ దర్శకుడు.. కొద్దిరోజులుగా తన పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వివాదాస్పద అంశాలపై సినిమాలు చేస్తున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక, తాజాగా టీచర్స్ డేను పురస్కరించుకుని వర్మ కొన్ని వివాదాస్పద పోస్టులు పెట్టాడు. ఇప్పుడవి హాట్ టాపిక్ అవుతున్నాయి.

    సోషల్ మీడియాలో యాక్టివ్

    రాంగోపాల్ వర్మ సినిమాలు చేస్తూ ఉన్నా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఆయన.. సామాజిక మాధ్యమాల్లో కూడా భిన్నంగా వ్యవహరిస్తుంటాడు. తన వ్యక్తిగతం అంశాలను పక్కన పెట్టి ఇతరులపై తరచూ ఏవో ఒక కామెంట్లు చేస్తూనే ఉంటాడు. దీంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అదే సమయంలో నెటిజన్ల ట్రోల్స్‌కు కూడా గురవుతున్నాడు.

    విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా?

    సెప్టెంబర్ 5 టీచర్స్ డేను పురస్కరించుకుని రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో వరుస పోస్టులు పెట్టాడు. ముఖ్యంగా ‘టీచర్స్ డే రోజు టీచర్లు.. టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా.. జస్ట్ ఆస్కింగ్' అంటూ చేసిన ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. అంతేకాదు, ఈ ట్వీట్‌కు టీచర్స్ విస్కీ బాటిల్‌తో పాటు తన ఫొటోను కూడా జోడించాడు.

    వాళ్లంతా ఫెయిల్

    వాళ్లంతా ఫెయిల్

    అలాగే, వర్మ మరో పోస్ట్ కూడా చేశాడు. ‘నన్ను మంచి విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో నా టీచర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. అందువల్ల నాకు టీచర్స్ డే అంటే ఏంటో తెలియదు' అంటూ అందులో పేర్కొన్నాడు. అలాగే, ‘నేను ఒక బ్యాడ్ స్టూడెంట్‌ను. నన్ను మంచిగా చేయలేకపోయిన టీచర్స్ కూడా గుడ్ కాదు' అని మరో ట్వీట్ చేశాడు.

    ప్రస్తుతం చేస్తున్న సినిమా

    ప్రస్తుతం చేస్తున్న సినిమా

    తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నాడు.

    English summary
    Even if I was a bad student,isn’t it the job of good teachers to make a bad student into a good student ? ..Since they failed, hence proved that they were bad teachers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X