కియారా అద్వానీ బికినీపై రాంగోపాల్ వర్మ ట్వీట్.. ఎన్టీఆర్, హృతిక్‌పై దారుణంగా కామెంట్
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). 2019 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ సినిమాగా విజయం అందుకొన్న వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి పార్ట్‌లో టైగర్ ష్రాఫ్, హృతిక్ నటించగా, ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. ఎన్టీఆర్ జన్మదిన మే 20 తేదీ సందర్బంగా వార్ 2 సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ, తమిళంలో రిలీజ్ చేశారు.
టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ హీరోలుగా వార్ చిత్రాన్ని సుమారుగా 170 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాంటి మూవీకి సీక్వెల్‌ను భారీగా నిర్మించారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా షబ్బీర్ అహ్లువాలియా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, శర్వారీ అతిథి పాత్రల్లో మెరువనున్నారు. ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయలతో హై యాక్షన్ మూవీగా నిర్మించారు. ఈ మూవీ గ్రాండియర్‌గా రూపొందించినట్టు టీజర్‌లో కనిపించిన సన్నివేశాలు ఫీలింగ్‌ను కల్పించాయి. అయితే ఈ సినిమా టీజర్, అందులో కియారా అద్వానీ గ్లామర్ గురించి చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఆర్జీవి చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..

వోడ్కాతో ఫేమస్ అయిన రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు కొన్నిసార్లు మంచి వినోదాన్ని మరికొన్ని సార్లు వివాదాన్ని క్రియేట్ చేస్తుంటాయి. అయితే చాలా సార్లు ఆయన ట్వీట్లపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తుంటారు. అయితే తన నైజాన్ని మరోసారి బయటపెడుతూ.. వార్ 2 సినిమాలోని కియారా అద్వానీ గ్లామర్ గురించి, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత దానిని డిలీట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా విడుదల చేసిన వార్ 2 టీజర్ గురించి రాంగోపాల్ వర్మ ఎప్పటిలానే తనదైన శైలిలో కామెంట్ చేశారు. దేశాలు, సమాజాల మంచికి బదులుగా, ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ ఒకవేళ జరిగితే దాని వల్ల కియారా వెనుక భాగం దొరుకుతుందేమో. వారికి లభించేది బ్లాక్ బస్టర్ కాదు.. బ్యాక్ బస్టర్ అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌పై రకరకాల కామెంట్స్ వినిపించాయి.
అయితే వార్ 2 గురించి వర్మ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భగ్గుమన్నారు. వర్మ చేసిన ట్వీట్‌పై మహిళలు భగ్గుమన్నారు. దాంతో వర్మ వెంటనే స్పందించి ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. దాంతో ఈ వివాదాస్పద ట్వీట్‌కు ముగింపు పలికేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో షేర్ చేయబడి ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నది. ఇలా బూతులతో ట్వీట్ చేసిన ఆయనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇలాంటి ట్వీట్లు చేస్తారా? అని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











