24 ఏళ్ల తరువాత ఆ హారర్ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్న ఆర్జీవి!

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా అదొక సంచలనమే. సక్సెస్ ఫెయిల్యూర్ అనే సంగతి పక్కనపెడితే తన కంటెంట్ వైరల్ అయ్యిందా లేదా అనే విషయంపైనే అర్జీవి ఎక్కువగా దృష్టి పెడుతుంటాడు. ఇకపోతే ఆర్జీవి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో ఒక హారర్ సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

Recommended Video

Ram Gopal Varma Planning To Come Up With 'Deyyam' Movie Sequel
హారర్ డైరెక్టర్..

హారర్ డైరెక్టర్..

రామ్ గోపాల్ వర్మ చాలా వరకు తన డైరెక్షన్ కెరీర్ లో అన్ని జానర్స్ ని టచ్ చేశాడు. మెయిన్ గా అసలైన హారర్ సినిమాలను ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం చేసిన ఫస్ట్ దర్శకుడు. రాత్రి, భూత్ వంటి సినిమాలు వర్మ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మళ్ళీ వర్మ అలాంటి సినిమాలు చేయలేదు.

 తప్పకుండా ఉంటుంది..

తప్పకుండా ఉంటుంది..

ఆ మధ్య హారర్ మూవీస్ చేసినప్పటికీ అవి ఎక్కువగా సక్సెస్ కాలేదు. అర్జీవి నుంచి ఒక మంచి హారర్ మూవీ చూడాలిని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. పైగా తెలుగులో ప్యూర్ హారర్ మూవీ వచ్చి చాలా కాలమవుతోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు. తప్పకుండా ఒక హారర్ మూవీ ఉంటుందని చెప్పాడు.

భయం..

భయం..

భయం అనే టైటిల్ తో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి మాత్రం చెప్పలేదు. కానీ కచ్చితంగా ఒక సినిమాతో అయితే భయాన్ని చూపించాలని అనుకుంటున్నాడట. గతంలో ఈ విదంగా వర్మ చెప్పిన కొన్ని సినిమాలు ఇంతవరకు రాలేదు. వస్తాయో లేదో కూడా తెలియదు.

ఆ సినిమాకు సీక్వెల్

ఆ సినిమాకు సీక్వెల్

వర్మ చెప్పిన సినిమాలే సరిగ్గా చేయడు. అలాంటిది ఒక డిఫరెంట్ సినిమా చేయబోతున్నాడు అనే రూమర్ వస్తే దాన్ని నమ్మడం కష్టమే. ఇకపోతే 24ఏళ్ల క్రితం వచ్చిన దెయ్యం(1996) సినిమాకు వర్మ సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమానే భయం పేరుతో తీస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X