New Year చేతిలో మందు గ్లాసు.. కౌగిలిలో అందాల భామను నలిపేస్తూ.. ఆర్జీవి న్యూఇయర్ సెలబ్రేషన్స్!

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అలాంటి సినిమాలే తీస్తూ రచ్చ చేస్తున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇష్టం ఉన్నట్లు నేను బతుకుతాను అంటూ ఆయన చెప్పే డైలాగ్ లు, మాటలు చాలా మందికి మింగుడు పడవు. కానీ కుర్రకారు మాత్రం ఆయనను తెగ ఫాలో అయిపోతుంటారు. బతికితే ఆయనలా బతకాలిరా అనుకుంటారు. తనకు నచ్చిన స్టైల్ లో లైఫ్ ను లీడ్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మలా బతకడం చాలా మందికి చేతకాదు. మనసులో ఉన్న ప్రతీ మాటను బయటకు చెబుతూ చాలా స్వేచ్ఛగా బతుకున్నారు.

అయితే 2023కి గుడ్ బై చెప్పేసి అంతా 2024కు వెల్ కమ్ చెప్పేశారు. ఈక్రమంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన స్టైల్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఎక్స్ వేధికగా పోస్ట్ చేస్తూ... ఎక్స్ ట్రీమ్లీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆర్జీవీ షేర్ చేసిన ఆ ఫొటో చూస్తే కుర్రకారు కుల్లు కునేలా ఉంది. ఎవరూ ఊహించని స్థాయిలో ఎంజాయ్ చేస్తున్న ఆయన ఫొటోలు చూసిన చాలా మంది ఇలాగే ఎంజాయ్ చేయాలనుకున్నాం... కానీ చేయలేకపోయాం అంటూ యువకులు చెప్పుకొచ్చే రీతిలో ఉంది. అయితే ఆ ఫొటోలో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ram Gopal Varma Extreme Level New Year Celebrations Check Details

ఎప్పటిలాగే ఆర్జీవీ ఓ చేతిలో మందు గ్లాసు, మరో చేతిలో అమ్మాయిని పట్టుకున్నాడు. ఆ అమ్మాయి.. ఆర్జీవీ మందు తాగిస్తూ కనిపిస్తోంది. ఆయనకు ఆమెకు తాగిస్తూ హగ్ చేసుకుని ఉన్నారు. ఇలా అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉన్న ఈయన ఓ వైపు మందు తాగుతూ మస్తుగా ఎంజాయ్ చేశారు. అయితే హైదరాబాద్ లోని మకావు క్లబ్ లో పార్టీ చేసుకున్నట్లు వెల్లడించారు. అంతే కాదండోయ్.. తాను ఏడాది పొడవునా ఇలాగే జరుపుకుంటానని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఆర్జీవీ పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తున్న వారంతా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

నువ్వు అస్సలే తగ్గొద్దు.. ఇలాగే ఎంజాయ్ అంటూ కొందరు, అదృష్టం అంటే నీది, అసలైన జీవితం అంటే నీది ఎంజాయ్ చెయ్ మావా అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. పిలిపించుకుంటే నేను కూడా నీతో పాటు పార్టీలో జాయిన్ అయ్యే వాడిని కదా అంటూ మరో నెటిజెన్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. అలాగే వేలాది మంది హ్యాపీ న్యూ ఇయర్ సార్.. ఎంజాయ్ హోల్ ద ఇయర్ అంటూ చెప్పుకొస్తున్నారు. మీరూ ఓసారి ఆర్జీవీ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

Ram Gopal Varma Extreme Level New Year Celebrations Check Details

ఆర్జీవీ ఇటీవలే వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమాను విడుదల చేయడానికి వీళ్లేందంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 11వ తేదీన వరకు సినిమాను రిలీజ్ చేయకూడదని చెప్పింది. ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని.. సీం జగన్ రాజకీయ జీవితాన్ని చూపించే ప్రయత్నం చేశారు ఆర్జీవీ. దీని వల్ల రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంభవించే అవకాశం ఉందని నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేయగగా ధర్మాసనం ఇలా తీర్పు ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X