12 మంది అమ్మాయిలతో రాంగోపాల్ వర్మ.. కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు
వ్యూహం సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చూస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మపై టీడీపీ సానుభూతిపరుడు, అమరావతి సాధన ఉద్యమకర్త కొలికపూడి శ్రీనివాసరావు ఏపీ సీఐడీ అధికారుల ముందు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఆర్జీవికి తీవ్రమైన పదజాలంతో హెచ్చరించారు. ఇక ముందు కూడా పిచ్చి వేషాలు వేస్తే సహించలేదని అల్టిమేటం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ..
రాంగోపాల్ వర్మ నాపై కేసు పెట్టిన తర్వాత ఏపీ సీఐడీ అధికారులు మా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. దాంతో నేను సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాను. ఆ సమయంలో నేను వర్మకు కాల్ చేసి నా అభిప్రాయం చెప్పేందుకు ప్రయత్నిస్తే.. నా ఫోన్ కాల్ ఎత్తలేదు. మీడియా వాళ్లను అడిగితే.. వాళ్లకు కూడా అందుబాటులో లేరని చెప్పారు అని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.

అయితే రాంగోపాల్ వర్మ నాపై కేసు పెట్టిన దాదాపు 12 మంది అమ్మాయిలతో ఫోన్ చేయించారు. ఈ సమయంలో నేను అమరావతి సాధన ఉద్యమంలో ఉండటం వల్ల నేను ఎవరికీ ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడం లేదు. నా బిజినెస్ పూర్తిగా ఆపేశాను. గత నాలుగు రోజుల్లో 12 మంది అమ్మాయిలు ఫోన్ చేశారు అని తెలిపారు.
గత కొద్దికాలంగా ఎవరూ కూడా కాల్ చేయలేదు. కానీ వర్మ కేసు నమోదు చేసిన తర్వాత ఏకంగా 12 మంది అమ్మాయిలు ఫోన్ చేసి ఐఏఎస్ కోచింగ్ గురించి అడిగారు. అయితే కొందరు ఒకే విధంగా అడగడంతో నాకు అనేక అనుమానాలు వచ్చాయి. వాళ్లలో ముగ్గురి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది. వర్మనే కాల్ చేయించి ఉంటాడని అనిపించింది అని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.

వ్యూహం సినిమా విషయం గురించి గానీ, ఇతర విషయాల గురించి కానీ ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయి. జగన్ కళ్లలో ఆనందం కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను, లోకేష్, వారి కుటుంబాల్లోని మహిళలపై అభ్యంతరమైన అంశాలతో సినిమాలు తీస్తే.. హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలో ఎక్కడా తిరగలేవు. ఖబర్దార్ అని కొలికపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఆయన తండ్రి మరణాంతరం జరిగిన సంఘటన ఆధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నట్టు ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాలు కనిపించాయి. అయితే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వర్మ తలను నరికి తెచ్చి ఇస్తే కోటి రూపాయలు బహుమానం ఇస్తానని కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఏపీ సీఐడీ అధికారులకు ఆర్జీవి ఫిర్యాదు చేశారు.


Click it and Unblock the Notifications











