RGV టెర్రిరిస్టులు కూడా షాక్ అవుతారు.. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోండి.. రాంగోపాల్ వర్మ
ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. వ్యూహం సినిమాపై చర్చ సందర్భంగా రాంగోపాల్ వర్మ తలను తీసుకొచ్చి ఇచ్చిన వారికి కోటి రూపాయలు బహుమతిని ఇస్తానని బహిరంగంగా ప్రకటించడంపై ఆర్జీవీ తీవ్రంగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విజయవాడలో ఏపీ డీజీపీని కలిసి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్జీవి తన పిటిషన్‌లో ఏమని ఫిర్యాదు చేశారంటే?
తెలుగుదేశం పార్టీకి చెందిన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 యాంకర్ సాంబశివరావు, ఆ ఛానెల్ అధినేత బీఆర్ నాయుడుపై ఫిర్యాదు చేస్తున్నాను. టెలివిజన్ లైవ్‌లో నా తలను నరికి తెచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అది కాకుండా నా ఇంటికి వచ్చి తగులబెడుతానని హెచ్చరించాడు అని వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొలికపూడి శ్రీనివాసరావు తీవ్రమైన పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేస్తుంటే.. నివారిస్తున్నట్టు నటిస్తూనే.. నన్ను చంపించడానికి మూడు సార్లు కాంట్రాక్ట్‌ను ఆయనతో రిపీట్ చేయించాడు. ఆ తర్వాత కూడా ఆయనతో సాంబశివరావు చర్చను కొనసాగించాడు. దాన్ని బట్టి వాళిద్దరూ నన్ను చంపటానికి కాంట్రాక్టు ఇవ్వడానికి ముందుగానే ప్లాన్ చేసుకొన్నట్టు క్లియర్‌గా అర్ధం అవుతుంది అని తన కంప్లైంట్‌లో వర్మ ఫిర్యాదు చేశారు.
కొలికపూడి శ్రీనివాసరావు నన్ను తానే చంపితే దారుణం. లైవ్ టీవీలో కూర్చొని నన్ను చంపితే కోటి రూపాయలు ఇస్తానని వేరే ఎవరికో డబ్బు ఆశ చూపడం, నేరానికి కుట్ర పన్నడం చేయడం ఇంకా దారుణం అని వర్మ పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ కిల్లింగ్ వార్తలు, వ్యాఖ్యలు, చర్చ జరుగుతున్నాయని తెలిసినా కూడా యాంకర్ సాంబశివరావును వెంటనే ఉద్యోగం నుంచి తీసేయలేదంటే.. ఈ కుట్రలో ఛానెల్ ఓనర్ బీఆర్ నాయుడుకి కూడా భాగం ఉన్నట్టు భావించాల్సి వస్తున్నది. ప్రజాస్వామ్యంలో కిల్లింగ్ కాంట్రాక్టులు పబ్లిక్‌గా ఇవ్వడం చూస్తే టెర్రరిస్టులు కూడా షాక్ అవుతారు. కాబట్టి ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోండి అని ఏపీ పోలీసులకు వర్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీజీపీని కలిసి కంప్లయింట్ కాపీని అందజేశారు.


Click it and Unblock the Notifications











