ఆ ఒక్కరిపైనే చాలాసార్లు ప్రేమ.. బుర్రలో మెదడు ఉంటే చాలూ.. యాంకర్‌పై పంచ్ వేసిన ఆర్జీవి

బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం రామ్ నగర్ బన్నీ. ఈ సినిమాను మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మాతలుగా శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రిచా జోషి, విస్మయ వ్రీ, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో జరిగిన ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే..

పలు కార్యక్రమాలతో వైభవంగా, ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకలో నిర్మాతలు దామోదర ప్రసాద్, కరాటే రాజు, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ బెజవాడ బేబక్క, మూవీ సమర్పకులరాలు దివిజా ప్రభాకర్, నటుడు సమీర్, మూవీలో నటించిన హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..

Ram Gopal Varma funny puches to Anchor Geeta Bhagat over Love proposal in Ram Nagar Bunny Event

ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌ను తెలుగు పరిశ్రమలోకి ఆహ్వానిస్తున్నాను. పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు చూసిన తర్వాత యాక్టర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయనిపించింది. చాలా చురుకుగా, అన్ని రకాల ప్రతిభ ఉన్న యాక్టర్ అనిపించింది. చంద్రహాస్ సక్సెస్ అవుతాడని నమ్ముతున్నాను.

అంబికా దర్బార్ అంటే వాసనకు చిహ్నం. ఈ హీరో విజువల్‌ అప్పీయరెన్స్ గుర్తుగా ఉన్నాడు అని వర్మ అన్నాడు. ట్రైలర్, పాటలు చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా సక్సెస్ కొట్టడానికి ప్రభాకర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని అనిపించింది. ఆయన కుమారుడిని సినీ పరిశ్రమకు పరిచయం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని అందుకోబోతున్నాడు అని వర్మ అన్నారు.

Ram Gopal Varma funny puches to Anchor Geeta Bhagat over Love proposal in Ram Nagar Bunny Event

స్పీచ్ తర్వాత ఆర్జీవితో యాంకర్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమ ఒక్కసారే కలుగుతుందా? ఒక్కరితోనే కలుగుతుందా? అది నిజమైనదేనా? అని అడిగితే.. చాలా సార్లు ఒక్కరితోనే కలిగింది అంటూ ఆయన తనదైన శైలిలో చెప్పారు. మళ్లీ ఒక్కసారి చెప్పమని అడిగితే.. చాలా సార్లు ప్రేమ ఒక్కొక్కరితోనే కలిగింది అని ఆర్జీవి అన్నారు.

ఆర్జీవి మాటలకు బిత్తరపోయిన యాంకర్ గీతా భగత్.. ఈ జవాబును అర్ధం చేసుకోవాలంటే.. కనీసం డిగ్రీ చదివి ఉండాలి అని అంటే.. చదువు కోవడం కాదు.. బుర్రలో మెదడు ఉండాలి అని వర్మ మరోసారి తనదైన శైలిలో పంచ్ చేశారు. అయితే మరో ప్రశ్న వేస్తూ.. ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోయిన్లు మీ ముందు ఉన్నారు. వారిలో ఎవరిపైనైనా ప్రేమ కలిగిందా? అని గీతా భగత్ అడిగితే.. చాలా మంది అమ్మాయిలు ఉంటే.. ఒక్కరి గురించి నేను మాట్లాడను అని వర్మ పంచ్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X