twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొరపాటున స్వర్గానికి నేను వస్తే.. మనం అమృతంతో పెగ్గు వేద్దాం.. సిరివెన్నెల మృతిపై ఆర్జీవి ఎమోషనల్

    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తొలి చిత్రం శివ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో యూత్‌ఫుల్ పాట బాటనీ పాటముంది.. మ్యాటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా అనే సాంగ్‌ను సిరివెన్నెల రాశారు. శివ మూవీ రిలీజ్ తర్వాత ఆ పాట మూరుమూల ప్రాంతాల్లోని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆకట్టుకొన్నది. అప్పటి నుంచి రాంగోపాల్ వర్మ, సిరివెన్నెల మధ్య సాహిత్య ప్రయాణం జరిగింది. సిరివెన్నెల ఆకస్మిక మరణంతో రాంగోపాల్ వర్మ భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆడియో ఫైల్‌ను పెట్టారు. ఆ ఆడియో ఫైల్‌లో ఆర్జీవి ఏం చెప్పారంటే..

    సిరివెన్నెలతో నా తొలి మెమొరీ

    సిరివెన్నెలతో నా తొలి మెమొరీ

    సిరివెన్నెల సీతారామశాస్త్రితో నా ఫస్ట్ మెమొరీ ఏమిటంటే.. అన్నపూర్ణ స్టూడియోలో ఓ చెట్టుకింద కూర్చొని ఒక సిట్యుయేషన్ చెప్పాను. ఆ సిట్యుయేషన్‌కు సంబంధించి పాట రాయమని అడిగాను. ఆ పాటలో కవిత్వం ఉండొద్దు.. పుస్తక సాహిత్యం అసలే ఉండకూడదు. మామూలు స్టూడెంట్ మాట్లాడుకొన్నట్టు ఉండాలి. స్టూడెంట్ మాటలతోనే పాట ఉండాలని చెప్పాను. ఆ తర్వాత కొద్ది సెకన్లలోనే బాటనీ పాఠం ఉంది అనే పాటను స్టార్ట్ చేశారు అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

    నా కోసం ఎన్నో పాటలు రాశారు..

    నా కోసం ఎన్నో పాటలు రాశారు..

    శివ సినిమా తర్వాత నేను తీసిన చాలా సినిమాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. అమ్మాయి ముద్దు ఇవ్వమంది.. గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు ఆ సిగ్గులేని జనాలను లాంటి పాటలను ఎన్నో రాశారు. ఇలా గుర్తు చేసుకొంటే నా కోసం ఎన్ని పాటలు రాశారని అనిపిస్తుంది అని వర్మ ఎమోషనల్ అయ్యారు.

    అందరం జీవిస్తాం.. కాని కొందరి జీవితాలే..

    అందరం జీవిస్తాం.. కాని కొందరి జీవితాలే..

    ఇప్పుడు సిరివెన్నెల లేరనే ఘటన తర్వాత ఫిలాసఫికల్‌గా ఓ ప్రముఖుడు చెప్పిన విషయాలను షేర్ చేసుకొందామని అనుకొంటున్నా.. మనం అందరం జీవిస్తాం. కొందరు జీవితం ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తారు. ఆయన లేరనే బాధ ఉన్నప్పటికీ.. జీవితకాలంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. భావితరం రచయితలు సిరివెన్నెలను గుర్తు చేసుకొంటారు అని ఆర్జీవి ఎమోషనల్ అయ్యారు.

    సిరివెన్నెల భౌతికంగా దూరమైనా

    సిరివెన్నెల భౌతికంగా దూరమైనా

    సిరివెన్నెల భౌతికంగా దూరమైనా.. ఆయన పాటలు ఎప్పటికీ ఉంటాయి. జీవితంలో ఆయన సినిమా పరిశ్రమకు చేసిన పనులు సజీవంగా ఉంటాయనే ఆలోచన నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది అని రాంగోపాల్ వర్మ జీవిత పరమార్థాన్ని చెప్పారు. సిరివెన్నెల రాసిన సాహసం నా రథం.. సాగితే ఆపడం సాధ్యమా అనేది నా జీవితం అంటూ పాటను పాడి వినిపించారు.

    Recommended Video

    Sirivennela Seetharama Sastry Garu మూగబోయిన సిరివెన్నెల || Filmibeat Telugu
    రంభ, ఊర్వశి, మేనకకు హలో చెప్పండి

    రంభ, ఊర్వశి, మేనకకు హలో చెప్పండి

    ఇప్పటి వరకు మీ జీవితంలో చేసిన మంచి పనుల కారణంగా తప్పుకుండా మీరు స్వర్గానికి వెళ్లి ఉంటారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు హలో చెప్పండి. ఎక్కువ పాపాలు చేసిన నేను నరకానికే వెళ్తాను.. కానీ యుముడి లెక్కల్లో పొరపాటు జరిగి.. ఒకవేళ నేను స్వర్గానికి వస్తే.. నాతో ఎప్పుడూ మీరు వోడ్కా తాగలేదు. కాబట్టి స్వర్గంలో ఓ పెగ్గు అమృతం వేద్దాం అంటూ వర్మ మరో ఆడియో ఫైల్‌లో తన అనుభూతులను షేర్ చేశారు.

    English summary
    Lyricist Sirivennela Seetha Rama Shastry no more. He Dies At The Age Of 66 Due To Pneumonia. In This tragic moment, Ram Gopal Varma Gets emotional on Sirivennela Seetharama Sastry death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X