twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్జీవి పాపలు మొత్తానికి ఇలా సెట్టయ్యారు.. త్వరలోనే మరో రెండు ఆఫర్లు

    |

    సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ కి డిమాండ్ పెరిగింది. ఏ మాత్రం క్లిక్కయినా కూడా ఈజీగా బడా ఆఫర్స్ అందుకోవచ్చు. ఇక గ్లామర్ తో హీటెక్కించె బ్యూటీలకు కూడా స్పెషల్ ఐటెమ్ సాంగ్స్ ద్వారా గిరాకీ ఎక్కువవుతోంది. అయితే ఈ మధ్య కాలంలో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోయిన్స్ కి మాత్రం గతంలో మాదిరిగా అవకాశాలు ఎక్కువగగా అందడం లేదు. అయితే మొత్తానికి ఎదో ఒక విధంగా ఒక ఇద్దరు బ్యూటీలు మాత్రం మంచి ఛాన్సులు అందుకొని వార్తల్లో నిలుస్తున్నారు.

    రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా..

    రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా..

    గతంలో వర్మ రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పరవాలేదు అని నటించిన హీరో హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సినిమా సక్సెస్ కాకపోయినా కూడా నటనతో ఆకట్టుకొని భవిష్యత్తులో మంచి క్రేజ్ అందుకోవచ్చని అనుకుంటారు. అందుకే రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇక ఇటీవల ఆయన శ్రీ రాపాక, అప్సర రాణి వంటి బ్యూటీలను హైలెట్ చేసిన విషయం తెలిసిందే.

    శ్రీ రాపాక నెక్స్ట్ ఎలాంటి సినిమా అంటే..

    శ్రీ రాపాక నెక్స్ట్ ఎలాంటి సినిమా అంటే..

    NNN అడల్ట్ కాన్సెప్ట్ తో శ్రీ రాపాకను ఒక్క రోజూలోనే హైలెట్ చేశాడు వర్మ. ఆ తరువాత అమెతోనే మరో సినిమా చేయాలని అనుకున్నాడు గాని ఇంకా దాన్ని ఆచరణలో పెట్టలేదు. అయితే ఆ బ్యూటీకి హాట్ గర్ల్ అనే క్రేజ్ దక్కింది గాని సరైన అవకాశాలు మాత్రం రాలేదు. అందరూ మర్చిపోతున్నారు అనే సమయానికి లస్ట్ అనే సినిమాను సెట్స్ పైకి తెచ్చింది. అలాగే త్వరలోనే మరో రెండు సినిమాలను కూడా చేయబోతోందట.

    అప్సర రాణి కూడా వరుసగా రెండు సినిమాలు

    అప్సర రాణి కూడా వరుసగా రెండు సినిమాలు

    ఇక మరో బ్యూటీ అప్సర రాణి కెరీర్ కోసమని ఏకంగా పేరు మార్చసిన ఆర్జీవి త్రిల్లర్, డేంజరస్ వంటి హాట్ మసాలా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక అప్సర రవితేజ క్రాక్ సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ తో మెప్పించనున్న విషయం తెలిసిందే. అలాగే ఆర్జీవి శిష్యుడు తెరకెకించబోయే ఒక కొత్త సినిమాతో పాటు కొత్త దర్శకుడితో కూడా ఆమె రొమాంటిక్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.

    Recommended Video

    Wrong Gopal Varma Movie Official Trailer
    అప్పుడే బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్

    అప్పుడే బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్

    మొత్తానికి ఆర్జీవి ప్రొడక్షన్ లో వర్క్ చేసిన శ్రీ రాపాక, అప్సర రాణి వరుసగా రెండు ఆఫర్లలో ఛాన్స్ అందుకోవడంతో అది వారి కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని సమాచారం.ఇక అప్సర రాణి బాలీవుడ్ లో కూడా వీలైనంత వరకు చిన్న సినిమాల్లో అయినా మంచి ఛాన్స్ అందుకోవాలని చూస్తోంది. మరి వర్మ తన పరిచాయలతో బాలీవుడ్ లో ఛాన్స్ దొరికేలా చేస్తాడో లేదో.. చూడాలి మరి.

    English summary
    RGV Thriller trailer,Director Ram Gopal Varma has once again targeted Pawan Kalyan. It has been rumored for the past few days that he is going to make a movie titled Power Star. Finally, he released a special first look poster for the film. Varma, who has been hanging out with some of the most spicy bold films, has now become a hot topic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X