శ్రీదేవీని వదలని ఆర్జీవీ.. అక్కడ కూడా ఆమె పక్కనే ఉంటాడట

వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈయనను ఇరుకున పెట్టాలని ఎలాంటి ప్రశ్నలు అడిగినా దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడం ఇతని నైజం. అలాంటి వర్మని ఏదైనా అడిగేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన నుంచి వచ్చే సమాధానం.. ఇక నోరు మూసుకో అనేట్టు ఘాటుగా ఉంటుంది. ఆయన నుంచి రాబోతోన్న మరో ప్రాజెక్ట్ బ్యూటీఫుల్. ఈ చిత్రానికి తనదైన స్టైల్‌లో పబ్లిసిటీ చేసినా.. ఆయన కోరిక ఇంకా తీరలేదనిపిస్తోంది. అందుకే మరో ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది.

 నెటిజన్ల ప్రశ్నలకు పిచ్చి సమాధానాలు..

నెటిజన్ల ప్రశ్నలకు పిచ్చి సమాధానాలు..

‘బ్యూటిఫుల్'..యాన్ ఓడ్ టు రంగీలా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో కొందరు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు వర్మ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. మీ తర్వాతి బయోపిక్ శ్రీదేవిపైనా లేక శశికళపైనా అని అడిగితే.. తాను శ్రీదేవిపై ఎలాంటి బయోపిక్ తీయననీ. ఎందుకంటే శ్రీదేవి లాంటి అమ్మాయి దొరకడం అసాధ్యమని అన్నాడు. కాబట్టి ఆమెపై బయోపిక్ తీసే ఐడియానే లేదని స్పష్టం చేశాడు. శ్రీదేవి, శశికళను కంపేర్ చేయడంలో అర్థంలేదు. ఎందుకంటే నేను అనుకుంటున్న పది, ఇరవై ప్రాజెక్ట్స్‌లో శశికళ బయోపిక్ ఒకటి. కాబట్టి ఆమెకు నేను అంత ప్రాధాన్యత ఇవ్వడంలేదని తేల్చి చెప్పాడు.

శ్రీదేవిని వదలని ఆర్జీవీ..

శ్రీదేవిని వదలని ఆర్జీవీ..

మీరు మరో గంటలో చనిపోతున్నారని తెలిస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు.. స్వర్గంలో తనకు తెలిసినవారందరికీ ఫోన్ చేసి శ్రీదేవి సమాధి ఎక్కుడుందో తెలుసుకుని ఆమె పక్కనే తనకు ప్లేస్ ఖాళీగా ఉంచమని చెప్తానంటూ ఆన్సర్ ఇచ్చాడు.

మహిళలకు ఇదే ట్రిబ్యూట్..

మహిళలకు ఇదే ట్రిబ్యూట్..

‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' సినిమా ఎందుకు తీయాలనిపించింది అనే ప్రశ్నకు.. జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్లే రెండే రెండు అంశాలు అమ్మాయి అందం, మగాడి పవర్ అని తన స్టైల్లో చెప్పేశాడు. ఈ సినిమాలో ఈ రెండు అంశాలూ ఉన్నాయని, ఇందులో అమ్మాయి అందంగా ఉంటుందని, ఓ మగాడికి ఉండే పవర్ కూడా ఉంటుందని పేర్కొన్నాడు. తాను ఈ సినిమా ద్వారా మహిళలకు ఇచ్చే ట్రిబ్యూట్ అదేనని చెప్పుకొచ్చాడు.

అడక్కుండా తీయండి..

అడక్కుండా తీయండి..

మీరు తీస్తున్నట్లే ఓ డైరెక్టర్ మీ బయోపిక్‌ను నెగిటివ్‌గా తీస్తే ఏం సమాధానం ఇస్తారని అడగ్గా.. తాను ఎవ్వరినీ అడిగి బయోపిక్ తీయలేదని తెలిపాడు. తాను చంద్రబాబు నాయుడిని అడగలేదు, ఎన్టీరామారావుని, లక్ష్మీ పార్వతిని అడగలేదన్నాడు. తనకు ఐడియా వచ్చి తీసేశానని చెప్పుకొచ్చాడు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉండాలనీ, కాబట్టి తన బయోపిక్ తీయాలంటే తనను అడగకుండా తీయండని అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X