For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాంట్రాక్ట్ కిల్లర్ కి సుపారీ ఇచ్చిన వర్మ.. ఆరోజున చంపాలని... వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువే!

  |

  రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్రెండీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్, అలాంటి ఆయన సినిమాలు ఇప్పుడు అన్నీ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. అంతెందుకు ఒకప్పుడు వర్మ సినిమాల కోసం ఎదురు చూసిన వాళ్ళు సైతం అసలు వర్మ సినిమా వస్తుందంటే పట్టించుకోని పరిస్థితి. కొన్నేళ్లుగా వర్మ తన రేంజ్‌కు తగ్గట్లుగా ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు కేవలం బయోపిక్ లు మాత్రమే చేస్తున్న ఆయన ఆ కోవలో చేసిన వంగవీటి, కిల్లింగ్ వీరప్పన్, ఎటాక్ 26/11 లాంటి సినిమాలు పర్వాలేదనిపించాయి. అయితే ఇప్పుడు కొందరిని టార్గెట్ చేసి ఆయన చేస్తున్న సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఆ విషయం పక్కన పెడితే ఆయన తాజాగా సుపారీ ఇచ్చానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  భయపెట్టని దెయ్యం

  భయపెట్టని దెయ్యం

  వర్మ ఈ మధ్య కాలంలో దెయ్యం అనే సినిమా రిలీజ్ చేశాడు. స్వాతి దీక్షిత్, రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా సరే ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేక పోయింది.. దాదాపు 23 ఏళ్ల క్రితం సినిమాను ఇప్పుడు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఇక వర్మ ప్రస్తుతం మరిన్ని బయోపిక్స్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఆయన నుంచి డీ కంపెనీ సినిమాకు సంబంధించి నాలుగు నిమిషాల సీన్ రిలీజ్ చేశారు.

   దావూద్ మీద ఫోకస్

  దావూద్ మీద ఫోకస్

  దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ప్ర‌ముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెర‌కెక్కించిన సినిమానే ఈ ‘డి - కంపెనీ'. అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ కీలక పాత్రలలో నటించారు. ఈనెల 15న స్పార్క్‌ ఓటీటీలో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సినిమాలోని 4 నిమిషాల సీన్ ని రిలీజ్ చేసి సినిమా మీద అసక్తి రేపే ప్రయత్నం చేశాడు ఆర్జీవీ.

  తెలియాలంటే సినిమా చూడాల్సిందే

  తెలియాలంటే సినిమా చూడాల్సిందే

  ఇప్పుడు ముంబ‌యి చాలా ప్ర‌శాంతంగా ఉంది. కానీ అప్పుడు 40 సంవ‌త్స‌రాల క్రితం డీ కంపెనీ కంట్రోల్ ఉన్న‌ప్పుడు ఇలా ఉండేది కాదు అని ఆర్జీవీ చెప్పిన మాట‌లు సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడనే అంశాలు ఈ సినిమాలో చూపించ‌నున్నారు. దావూద్ చ‌రిత్ర ఏంటో పూర్తిగా తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు.

  ఆరోజున చంపెయ్యమన్నా

  ఆరోజున చంపెయ్యమన్నా

  ఆ విషయం పక్కన పెడితే రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటూనే ఉంటాడు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒకరి మీద ఆధారపడి బతకాల్సిన రోజు వస్తే తనను చంపేయాలని ఒక కాంట్రాక్ట్ కిల్లర్ కి సుపారీ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. ఏరోజు అయితే తాను మంచాన పడతానో అప్పుడు వేరే వాళ్ళు తనను జాగ్రత్తగా చూసుకోవాలి వస్తుందని ఆ సమయంలో చంపేయ్యమని ఒక అతనికి సుపారీ ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు.

  Ys Jagan పై మూవీ ఉంటుంది, Pawan Kalyan ని హ్యాండిల్ చెయ్యలేను - RGV || Filmibeat Telugu
   కూతురికి అలా చెప్పా

  కూతురికి అలా చెప్పా

  అయితే ఎలా చంపమని సుపారీ ఇచ్చారు అనే విషయం మాత్రం వర్మ పంచుకోలేదు. అలాగే తాను జీవితంలో చివరి రోజుల్లో ఉన్నాను అనిపించినా సరే ఎవరూ తనను చూడడానికి రాకూడదని, తన కూతురు కూడా రావడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ఇక భార్యతో విడాకులు తీసుకున్న తరువాత తన కూతురికి ఒక విషయం చెప్పాను అని చెప్పుకొచ్చాడు వర్మ. వేరే వాళ్ళు తన గురించి ఎంత చెడ్డగా చెప్పిన దానికి మించి చెడ్డవాడిని అని తమ కూతురికి చెప్పానని చెప్పుకు వచ్చాడు

  English summary
  Known for controversial statements, RGV has made a sensational revelation in an interview. That he has hired a person to kill him. The day he might be bed ridden or others have to take care of him, he has asked a person to kill him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X