For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాలేజీలో వ‌ర్మ‌ లవర్.. ఈమె నా ఫ‌స్ట్ అంటూ స్విమ్ సూట్ ఫోటోలు.. డబ్బున్న కుర్రాడితో!

  |

  సంచలనాలకు మారుపేరుగా మారిన రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ దాన్ని వివాదాస్పదంగా మార్చే వర్మ ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న సినిమాల కంటే వివాదాల కే ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు మూడు రోజులుగా ఆయన ఒక నటి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో చేసిన అశ్లీల నృత్యం ఆమె కాళ్ళ మీద పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  తొలి ప్రేమను ఇలా

  తొలి ప్రేమను ఇలా

  ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉంటే అనూహ్యంగా అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యామిలీ మీద కామెంట్ చేసి మళ్ళీ మరో రచ్చ లేపాడు. ఇదంతా ఇలా ఉంటే మరో పక్క ఒక స్విమ్ సూట్ లో ఉన్న మహిళ ఫొటో షేర్ చేసిన వర్మ ఆమె తన ఫస్ట్ లవర్ అని పేర్కొని రచ్చ రేపారు. అయితే ఇప్పుడు అసలు కమిట్మెంట్ బంధాలు అనేవి తనకు లేవని చెబుతూ ఉండే రామ్ గోపాల్ వర్మ తన తొలి ప్రేమను ఇలా పరిచయం చేయడంతో ఆశ్చర్యపోతున్నారు.

  ఫస్ట్ లవ్

  ఫస్ట్ లవ్

  ఎందుకంటే ఎప్పుడూ తన లవ్ శ్రీదేవి అని చెప్పుకుంటూ వచ్చిన వర్మ ఇప్పుడు ఏకంగా కాలేజీ రోజుల్లోనే ఓ అమ్మాయిని ప్రేమించి నట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. వర్మ వెల్లడించిన వివరాల ప్రకారం ఆమె పేరు పోలవరపు సత్య ఆమె ఆ రోజుల్లో మెడిసిన్ చదివేదట. బ్లూ స్విమ్ షూట్ లో ఉన్న ఆమె పేరు సత్య ఆమె సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ లో నేను చదువుతున్నప్పుడు నా ఫస్ట్ లవ్ ఆమె ప్రస్తుతం అమెరికాలో మెటర్నిటీ డాక్టర్ గా పని చేస్తున్నారు అందులో ఆమె స్పెషలిస్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు.

  ఆరోజుల్లో వన్ సైడ్ లవ్

  ఆరోజుల్లో వన్ సైడ్ లవ్

  విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రామ్ గోపాల్ వర్మ ఇంజనీరింగ్ చదివిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లగడపాటి రాజగోపాల్ తో కలిసి చదివారు. ఇక అదే క్యాంపస్లో సిద్ధార్థ మెడికల్ కాలేజీ కూడా ఉండేదని అందులో సత్య మెడిసిన్ చేసేదని చెప్పుకొచ్చారు. అయితే ఆమెను చూశాక ఆమె ప్రేమలో పడ్డానని వన్ సైడ్ లవ్ అని చెప్పుకొచ్చారు.

  డబ్బున్న కుర్రాడి కారణంగా

  డబ్బున్న కుర్రాడి కారణంగా

  అయితే ఒక డబ్బున్న అందమైన కుర్రాడి కారణంగా ఆమె తనను పట్టించుకోవడం లేదని తాను ఫీలయ్యే వాడినని ఆ దాని గురించే రంగీలా సినిమా చేశానని చెప్పుకొచ్చాడు. మరో విషయం ఏమిటంటే నా ల్యాండ్ మార్క్ ఫిలిమ్ అయిన సత్య అలాగే క్షణక్షణం సినిమాలో శ్రీదేవి పేరు ఈ పోలవరపు సత్యను చూసే పెట్టానని కాకపోతే ఈ ఫొటోలు ప్రస్తుతం ఆమె ఫోటోలని ఆమె బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఈ ఫోటోలు తనకు పెట్టిందని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు.

  Bheemla Nayak Vs Acharya.. ఏమి సేతుర సామీ ! || Filmibeat Telugu
  ఇద్దరూ ఒకరినొకరు

  ఇద్దరూ ఒకరినొకరు


  ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సదరు డాక్టరమ్మ కూడా రామ్ గోపాల్ వర్మను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్లో ఆమెను ఫాలో అవుతున్నారు. రాంగోపాల్ వర్మ ఆమె ఎకౌంటుని పేర్కొంటూ ట్వీట్లు చేయడంతో ఆమె ఎకౌంట్కు విపరీతంగా ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే వర్మ చేస్తున్న కొన్ని ట్వీట్లను సదరు డాక్టరమ్మ రీట్వీట్ కూడా చేస్తున్నారు. ఇక వర్మ వివాహం చేసుకుని ఇప్పుడు ఆమెకు దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద వర్మ చేసిన ట్వీట్లు మాత్రం సంచలనంగా మారాయి అని చెప్పక తప్పదు.

  English summary
  Ram Gopal Varma Introduces his first love in college named satya polavarapu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X