టాలీవుడ్‌కు కొత్త హీరోయిన్.. వర్మ థ్రిల్లింగ్‌గా చెక్కిన అందాల శిల్పం ఎవరంటే..
లాక్‌డౌన్‌లో సినీ పరిశ్రమలన్నీ స్తంభిస్తే రాంగోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. లాక్‌డౌన్‌లో కరోనావైరస్, క్లైమాక్స్, నేకెడ్ లాంటి చిత్రాలను రూపొందించి రిలీజ్ చేసి భారీ లాభాలను సొంతం చేసుకొంటున్నారు. జీఎస్టీతో మియా మాల్కోవాను, నేకెడ్ చిత్రంలో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాకను తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ.. తాజాగా అప్సర రాణి అనే యువతిని ఇంట్రడ్యూస్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఆమె గురించిన వివరాలు తెలియచేస్తూ..

శ్రీదేవి, ఊర్మిళ, మియా మాల్కోవా లాంటి
వెండి తెర మీద హీరోయిన్లను ఆవిష్కరించడంలో రాంగోపాల్ వర్మది ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంటుంది. శ్రీదేవీ నుంచి ఊర్మిళ వరకు.. ఆంత్రమాలి నుంచి మొన్నటి శ్రీ రాపాక వరకు పలు హీరోయిన్లతో శృంగారాన్ని పండించడం ఆయనకే చెల్లింది. అందుకే ఆయన చిత్రాల్లో నటించడానికి యువ తారలు ఉత్సాహ పడుతుంటారు.

ఒడిశా యువతిని థ్రిల్లర్ ద్వారా
తాజాగా థ్రిల్లర్ అనే సినిమాను రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రంలో ఒడిశాకు చెందిన అప్సర రాణి అనే యువతిని వర్మ పరిచయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమె అందాన్ని వర్ణిస్తూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఫోటోలను ట్వీట్ చేస్తూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు.

నేకెడ్, క్లైమాక్స్ తర్వాత
తన కొత్త హీరోయిన్ గురించి వరుసగా ట్వీట్లు చేశారు. నేకెడ్, క్లైమాక్స్ చిత్రాలు ఘన విజయం సాధించిన తర్వాత నా ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో థ్రిల్లర్ అనే సినిమాను రిలీజ్ చేస్తున్నాను. త్వరలో విడుదల కాబోతున్న థ్రిల్లర్ చిత్రంలో అప్సర రాణిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాను అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

నటి కంటే మంచి డ్యాన్సర్
అప్సర రాణి విషయానికి వస్తే.. ఒడిశాలో పుట్టి డెహ్రాడూన్‌లోని కొండల మధ్య పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమె మంచి నటి కంటే అద్భుతమైన డాన్సర్ అంటూ రాంగోపాల్ వర్మ మరో ట్వీట్‌లో అప్సరరాణి గురించిన వివరాలను పేర్కొన్నారు.

ఒడిశా సృష్టించిన అందాల హరికేన్
అప్సరను కలవడానికి ముందు ఒడిశా గురించి నాకు ఏమీ తెలియదు. ఒడిశా గురించి నాకు తెలిసిందల్లా ఒకటే 1999లో వచ్చిన హరికేన్ మాత్రమే. ఆమెను కలిసిన తర్వాత ఒడిశా అన్ని రకాల హరికేన్లన్లను సృషించిందనే విషయాన్ని తెలుసుకొన్నాను. ఒడిశాలో ఇంత అందం దాగి ఉందని ఇప్పుడే తెలుసుకొన్నాను. ఇది ఒడిశాకు మరింత బలం అంటూ రాంగోపాల్ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Recommended Video

గతంలో రెండు, మూడు చిత్రాల్లో
ఇక అప్సర రాణి విషయానికి వస్తే.. ఇప్పటికే తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించినట్టు తెలుస్తున్నది. ఇటీవల వచ్చిన ఉల్లాల ఉల్లాల చిత్రంలోను.. అలాగే ఆ మధ్యలో వచ్చిన 4 లెటర్స్ చిత్రంలో అంకిత మహారాణా పేరుతో హీరోయిన్‌గా నటించినట్టు తెలిసింది. అయితే ఆ చిత్రాల వల్ల అంతగా గుర్తింపు రాకపోవడంతో తాజాగా అప్సరగా పేరు మార్చుకొని వర్మతో తన జాతకాన్ని పరీక్షించుకొంటున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











