డిజాస్టర్ మూవీని సొంత డబ్బుతో ఆఢించాడు.. స్టార్ హీరో వ్యవహారం బయటపెట్టిన ఆర్జీవి

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముఖస్తుతి లేకుండా ముక్కుసూటిగా విషయాలు వెల్లడించడంలో అతడిలో ఎలాంటి తడబాటు కనిపించదు. తనకు తెలిసిన విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతాడు. తాజాగా సినిమా కలెక్షన్లు, బాక్సాఫీస్ వసూళ్ల తారుమారు, సినిమాలకు జనం లేకున్నా నడిపించే స్టార్ హీరోలు, వారి అభిమానుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా రంగంలో అత్యధిక రోజులపాటు సినిమాను ఆడించడమనేది ఎప్పటి నుంచో వస్తున్నది. అయితే ఇటీవల కాలంలో 100 రోజులు, ఆపై ఎక్కువ రోజులు ఆడించే పద్దతిపోయి.. ఎక్కువగా కలెక్షన్లు రాబట్టే స్కీమ్ నడుస్తున్నది. అయితే సినిమా బాగాలేకపోయినా కొన్నిసార్లు అలాగే ఆఢించేసి నిర్మాత, డిస్టిబ్యూటర్లకు కష్టాలు తెచ్చి పెట్టిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.

Ram Gopal Varma leaks Tollywood Hero Paid for Movie Long run in Theatre

తాజాగా ఇటీవల రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు. రికార్డు కోసం ఓ సినిమాను ఓ హీరో ఆడించాలని నిర్ణయం తీసుకొన్నాడు. ఆ విషయం డిస్టిబ్యూటర్‌కు తెలియక ఆయన కంగారు పడ్డాడు. జనం లేకపోయినా సినిమాను ఖాళీ థియేటర్‌తో ఆడించి డబ్బులు కట్టారు అని తెలిపారు.

బాలీవుడ్‌కు చెందిన ఓ కార్పోరేట్ కంపెనీ ఇటీవల ఓ తెలుగు హీరోతో సినిమా చేసింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో నష్టాల బారిన కొనసాగింది. అయితే ఆ కంపెనీ వచ్చి హీరోకు కొన్ని సూచనలు ఇస్తూ సినిమాను థియేటర్ల నుంచి తీసేయాలని చెప్పింది. ఇక నష్టాలతో థియేటర్‌లో నడిపించలేమని చేతులెత్తిసింది అని రాంగోపాల్ వర్మ చెప్పారు.

Ram Gopal Varma leaks Tollywood Hero Paid for Movie Long run in Theatre

అయితే కార్పోరేట్ కంపెనీ నిర్ణయంతో హీరో అంగీకరించాడు. కానీ ఆయన ఫ్యాన్స్ గొడవ చేసి నడిపించాలని పట్టు బట్టారు. సినిమాను ముందే తీసేస్తే మాకు మీ ఫ్యాన్స్‌గా అవమానంగా ఉంటుంది. కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఈ సినిమాను ఆడించాల్సిందేనని బెట్టు చేశారు.

దాంతో కార్పోరేట్ కంపెనీకి సదరు హీరో ఫోన్ చేసి.. ఈ సినిమాను కొంతకాలం నేనే ఆడిస్తాను. అందుకు ఎంత డబ్బు అయినా నేను భరిస్తాను అని చెప్పాడు. అయితే డిస్టిబ్యూటర్లకు ఈ విషయం చెప్పడంలో విఫలమయ్యారు. దాంతో పేపర్లో యాడ్ ఇవ్వడం ఆపేశాడు. కార్పోరేట్ సంస్థ డబ్బులు ఇవ్వకపోవడంతో సినిమా థియేటర్లలో ఆడుతున్నప్పటికీ.. యాడ్స్ ఇవ్వలేదు. కార్పోరేట్ సంస్థల వ్యవహారం ఇలా ఉంటుంది అని చెప్పారు. అయితే ఆ హీరో ఎవరనే విషయం చర్చ జరుగుతున్నది.

More from Filmibeat

Read more about: ram gopal varma tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X