అంబానీ పెళ్లి..అభిమానంతో రాలేదు, ఆ సెలబ్రెటీలంతా పెయిడ్ ఆర్టిస్టులే: ఆర్జీవీ హాట్ కామెంట్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో ఇటీవల ఘనంగా జరిగింది. ఇటీవల ముంబైలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుక యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ విదేశాల నుంచి సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా తదితర రంగాలకు చెందిన అతిరథ మహారథులు ముంబైకి తరలివచ్చి అనంత్ - రాధిక దంపతులను ఆశీర్వదించారు.
సాదాసీదా వ్యక్తులే డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరిట కోట్లు ఖర్చు చేస్తుంటే .. మరి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన అంబానీ కుమారుడి పెళ్లి అంటే తరతరాలు చెప్పుకోవద్దు. అందుకు తగ్గట్టుగానే కళ్లు చెదిరే ఏర్పాట్లు చేశారు. తన సంపద ప్రదర్శనకు, తన అట్టహాసానికి, తన దర్పానికి, తన ఆడంబరానికీ అనుగుణంగా తనయుడి పెళ్లిని ముఖేష్ జరిపించారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అనంత్ అంబానీ పెళ్లికి అక్షరాల రూ.5 వేల కోట్లను ఈ పెళ్లి కోసం ఖర్చు చేశారని అంచనా.

ఈ వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులు, ఆత్మీయులు, విశిష్ట అతిథుల కోసం అంబానీ కుటుంబం ప్రత్యేకంగా బహుమతులను తయారు చేయించింది. అత్యంత ఖరీదైన అడెమార్స్ పిగ్యుట్ బ్రాండ్‌కు చెందిన వాచీలను కానుకగా ఇచ్చారు. దీని ఒక యూనిట్ ధర అక్షరాల రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. ఇదొక్కటే కాదు.. అంబానీల పెళ్లిలో ఎన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. పెళ్లికి హాజరైన ప్రముఖులు సైతం భారీగానే కట్న కానుకలు సమర్పించారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నుంచి మొదలుకొని అమితాబ్ బచ్చన్ వరకు రూ. కోట్లాది విలువైన బహుమతులను కొత్త జంటకు అందజేశారు.
ఈ పెళ్లికి హాజరవ్వాలని చాలా మంది సెలబ్రెటీలు కలలు కన్నారు. కానీ కొందరికి మాత్రమే ఆ అవకాశం దక్కింది. అక్కడికి వెళ్లనందుకు పలువురు బాగా డిజప్పాయింట్ అయ్యారు. వీళ్ల తాపత్రయమంతా అంబానీ కళ్లలో పడాలనే అన్నది బహిరంగ రహస్యం. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ .. అనంత్ అంబానీ పెళ్లిని టార్గెట్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివాహం, దీనికి హాజరైన సెలబ్రెటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెలబ్రెటీలను మ్యారేజ్‌లకు , బర్త్ డే పార్టీలకు రకరకాల ఫంక్షన్స్‌కు పిలిచేది.. తమ పెళ్లికి, ఫంక్షన్స్‌కి ఫలానా స్టార్స్ వచ్చారని గొప్పగా చెప్పుకోవడానికేనని వర్మ చెప్పారు. ఇది వాళ్ల స్టార్‌డమ్‌ను వాడుకోవడమేనని.. అనంత్ అంబానీ పెళ్లికి జస్టిన్ బీబర్, రిహన్నా వంటి హాలీవుడ్ స్టార్స్ వచ్చారని.. వీరికి కోట్లలో డబ్బు ఇచ్చారంటూ వస్తున్న వార్తలు నిజమేనని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌లో సన్నీలియోన్ ఒక్క బర్త్ డే పార్టీకి వస్తేనే రూ.25 లక్షలు తీసుకుంటుందని ఆయన ఆరోపించారు. నా బర్త్ డేకి సన్నీలియోన్ వచ్చిందని ఆ వ్యక్తి డబ్బా కొట్టుకుంటాడని వర్మ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











