హీరోయిన్లపై ఆ తోడేళ్ళ గుంపు.. కోరికలు తీర్చమంటూ అరాచకం..రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్

Ram Gopal Varma: సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారాలు వరుసగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను బయటపెట్టింది. దీంతో పలువురు సెలబ్రెటీలు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు పంచుకున్నారు. పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పలువురుపై కేసు నమోదయ్యాయి. ఈ వివాదం సమాసి పోకముందే.. తాజాగా టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన తన దగ్గర పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేసినట్టు ఆరోపించింది. ఈ క్రమంలో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జానీ మాస్టర్ వివాదం, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇటీవల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్య్వూ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు లాంటి వివాదాలు చాలానే జరుగుతాయి. అవకాశాలిస్తాని తమ కోరికలను తీర్చచుకోనే తోడేలు చాలా మందే ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి దారుణాలకు అమ్మాయిలు దూరంగా ఉండాలనీ, అలాంటి అవకాశవాదులకు, కామాంధులకు దూరంగా ఉండాలని సూచించారు. వాస్తవానికి ఇలాంటి ఘటనల చాలనే జరుగుతున్నాయి. కానీ కొంతమంది మాత్రమే తమకు జరిగిన దారుణాలను బయటపెడుతున్నారని అన్నారు. ఇతరుల ప్రోత్సాహం, ఒత్తిడితో ఇండస్ట్రీకి వచ్చేవారు ముందుగా తమ టాలెంట్ ఎంటీ? ఇండస్ట్రీ పరిస్థితులకు తాము తట్టుకుంటామా? లేదా ? అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి' అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సూచించారు.

Director Ram Gopal Varma made shocking comments on the Johnny Master controversy and sexual harassment in the film industry

బడాబడా మూవీ మేకర్స్ ఇలాంటి దారుణాలకు పాల్పడారనీ, చిన్న చిన్న,రిజిస్టర్డ్ కానీ మూవీ మేకర్స్ తో 70 శాతం ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. చాలా మంది ఈ గ్లామర్ వరల్డ్ కు ఆట్రాక్ట్ అవుతున్నారనీ, కానీ తమలో టాలెంట్ ఉందా ? లేదా ? అనే విషయాలను కూడా ముందుగా తెలుసుకోవాలని అన్నారు. ఇలా అమ్మాయిలపై దాడులు చేసే మాఫియా ఏం ఉండదు. కానీ, నాకు కమిట్మెంట్ ఇవ్వకపోతే.. సినిమా అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడేవారున్నారని, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు తమ కల నేరవేర్చుకోవాలంటే.. ముందుగా మధ్యలో ఉంటే తోడేలు, ముంగిలా కోరికలను తీర్చాల్సి వస్తుందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన విషయాలను వెల్లడించారు.

ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తగ్గాలంటే కీలక నిర్ణయాలు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసుకోవాలన్నారు. ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారో అలాంటి వారికి సంబంధిత డిపార్ట్ మెంట్ లో మెంబర్ షిప్ తీసుకోవాలని చెప్పాలి. ఆ తరువాత ఇండస్ట్రీకి గురించి అవగాహన కల్పించాలి. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? ఏదైనా సమస్యలు వస్తే ఎవరికి చెప్పాలి? ఏవైనా వేధింపులు ఎదురైతే ఎవరికి తెలియజేయాలి? అనే విషయాలపై వారికి పూర్తిగా అవగాహన కల్పించాలి. అలా చేస్తేనే కొత్తవారికి ఇండస్ట్రీ అంటేంటో అర్థమవుతోంది' అని ఆర్జీవీ సూచించారు.

రామ్ గోపాల్ వర్మ ఇంకా మాట్లాడుతూ..' మెంబర్ షిప్ లేని వారిని సినిమాల్లోకి తీసుకోము. కమిటీలో సభ్యత్వం లేకుండా సినిమాలో నటిస్తే చర్యలు తీసుకుంటారనే కండీషన్ పెట్టాలి. ఇలా కొత్తగా వచ్చేవారికి ఇండస్ట్రీపై అవగాహన కల్పించి వారికి మెంబర్ షిప్ ఇస్తే.. వారిపై ఎలాంటి దాడులు జరుగుకుండా చూసుకోవచ్చు. ఒక వేళ అమ్మాయిని ఇబ్బంది పెడితే.. ఆ తరువాత ఆ అమ్మాయి తరువాత కమిటీకి ఫిర్యాదు చేస్తుందనే భయం ఉంటుంది. అప్పుడు అమ్మాయిలను ప్రలోభపెట్టేవారిని కూడా నియంత్రిచవచ్చు. ' అని కీలక సూచనలు చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

కేవలం అమ్మాయిలకే కాదు. ఇతర డిపార్టు మెంట్ విషయాలపై కూడా కొత్తవారికి అవగాహన కల్పించడం వల్ల దోపిడీలు, దారుణాలు తగ్గుతాయి. కానీ, అంతా అయిపోయిన తరువాత పోలీసులు, కమిటీలు చూట్టు తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కొత్త వారికి అవగాహన కార్యక్రమాలు అనేవి చాలా ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరి ఆధార్ ఉన్నట్లే.. ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకున్నవారికి సంబంధిత డిపార్ట్ మెంట్లో మెంబర్ షిప్ తో పాటు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం' అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పలు ముఖ్య సూచనలు చేశారు.

More from Filmibeat

Read more about: ram gopal varma johnny master
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X