twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV 'మర్డర్' ట్రైలర్: తప్పు చేస్తే చంపించడం తప్పా?.. సమాధానం మీరే చెప్పండి!

    |

    విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొన్నటివరకు అడల్ట్ కంటెంట్ సినిమాలు చేసి ఆ తరువాత పవర్ స్టార్ అంటూ పొలిటికల్ అంశాలను టచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన మర్డర్ అనే సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. మిర్యాల గూడా పరువు హత్య కేసు గురించి అందరికి తెలిసిందే. అయితే ఆ ఘటనను సినిమాగా చూపించనున్న వర్మ ట్రైలర్ ని వదిలాడు.

    ఏ విధంగా ఆలోచించాడు

    ఏ విధంగా ఆలోచించాడు

    అమృత, ప్రణయ్, మారుతి రావ్ వంటి పేర్లు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే పరువు కారణంగా కూతురి భర్తను చంపించిన మారుతి రావు ఏ విధంగా ఆలోచించాడు.. అలాగే అతను ఆ తరువాత మరణించిన తీరు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అదే పాయింట్ ని పట్టిన వర్మ తన శిష్యుడితో కలిసి మొత్తానికి సినిమాను రెడీ చేశాడు.

    తప్పు చేస్తే చంపించడం తప్పా?

    తప్పు చేస్తే చంపించడం తప్పా?

    ఇక ట్రైలర్ ని విడుదల చేసిన ఆర్జివి తన మార్క్ మేకింగ్ ఎలా ఉంటుందో చూపించాడు. ఒక మనిషి పరిస్థితుల ప్రభావం వల్ల ఎలా ఆలోచిస్తాడు అనే విషయాన్ని ఈ సినిమాలో హైలెట్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రేమించడం తప్పా అనే ప్రశ్న ఒక వైపు.. తప్పు చేస్తే చంపించడం తప్పా? అనే సందేహాన్ని మరొకవైపు హైలెట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.

    ఒక్క డైలాగ్ కూడా లేకుండా

    ఒక్క డైలాగ్ కూడా లేకుండా

    పాత్రలో ఎంపిక విధానం.. కెమెరా ముందు వారిని ఎలా చూపించాలి అనే విషయంలో వర్మ ఎంత క్లారిటీగా ఉన్నాడో ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా ట్రైలర్ లోనే కథను మొత్తం చూపించిన వర్మ మొత్తం సినిమాతో ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

    Recommended Video

    Poonum Kaur Fires On Police About Priyank Reddy Murder

    సమాధానం మీరే చెప్పండి

    ఇక ట్రైలర్ లో చివరగా ఆసక్తికరమైన సందేహాన్ని లేవనెత్తారు. పిల్లలని కనగలం గాని వాళ్ళ మనస్తత్వాలను కనగలమా? అంటూ.. సమాధానం మీరే చెప్పండి అనే ఆలోచనను కలిగించారు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా ఉన్న ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు ఆనంద్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. ఇక వర్మ ముందుండి ఈ సినిమాను నడిపించినట్లు తెలుస్తోంది.

    English summary
    It is a known fact that the typical director Ram Gopal Varma has done adult content films till now and then touched the political aspects of being a power star. And now he is promoting a movie called Murder based on an actual incident. Everyone knows about miryalaguda defamation case. However, Varma left the trailer to show the incident as a movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X