RGV Den: అడుగడుగునా అశ్లీల చిత్రాలతో రామ్ గోపాల్ వర్మ కొత్త ఆఫీస్.. ఎలా ఉందంటే?

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండటమే కాదు ఏం చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఆయనపై ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శలు చేసిన అతని అభిమానించేవారు ఎక్కువే. ఎవరు చేయలని విధమైన ట్వీట్స్, కామెంట్స్ ఆర్జీవీ సొంతం. మాట్లాడే మాటాల్లోనే వైవిధ్యం వెతికే రామ్ గోపాల్ వర్మ తాను పనిచేసే ఆఫీస్ ఇంకెంత విభిన్నంగా ఉంటుందో అని మన ఊహకే వదిలేశారు. తాజాగా ఆర్జీవీ డెన్ 9RGV Den) పేరుతో తన కార్యాలయాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. ఆర్జీవీ ఆఫీస్ లో ఎలాంటి విశేషాలు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

హైదరాబద్ లో:టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. కామెంట్స్, సెటైర్స్, మూవీస్, బిహేవియర్ ఏది చూసుకున్న అందులో కొత్తదనం ఉంటుంది. అలాగే తాను పనిచేసే ఆఫీస్ ను కూడా అంతకుమించి అన్నట్లుగా వైవిధ్యంగా రూపొందించుకున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. దానికి ఆర్జీవీ డెన్ అని పేరు పెట్టారు.

ఆర్జీవీ ఆలోచనలకు:ఆర్జీవీ డెన్ లోని విశేషాలను వీడియోగా తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవడమే కాకుండా ఆర్జీవీ డెన్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాటలకు, ఆలోచన విధానానికి నూటికి నూరు శాతం ప్రతిబింబించేలా కొత్త కార్యాలయాన్ని నిర్మించారు.

Ram Gopal Varma New Office RGV Den In Hyderabad Video Released

ఫారెస్ట్ థీమ్:లోపల మొత్తం గ్రీనరీ, కొండలు, గుహల, రాళ్ల థీమ్ తో అడవిని తలపించేలా ఉంది ఆర్జీవీ డెన్. ఆఫీస్ ఎంట్రన్స్ లో అక్కినేని నాగార్జునతో దిగిన ఫొటో పెట్టి ఆయనపై ఉన్న అభిమానాన్ని చూపించారు రామ్ గోపాల్ వర్మ. లోపల కూడా నాగార్జునతో ఉన్న భారీ సైజ్ ఫొటో ఆకర్షణీయంగా ఉంది. ఫారెస్ట్ థీమ్ తో ఉన్న ఆఫీస్ లో లైటింగ్ కూడా అట్రాక్ట్ చేసేలా ఉంది.

Ram Gopal Varma New Office RGV Den In Hyderabad Video Released

మోటివేషన్ కోట్స్:ఇక రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ గోడలపై మోటివేటివ్ కొటేషన్స్ ఉన్నాయి. 'బిలీవర్స్ విల్ బి ఫైర్ డ్', 'నీకు నా డ్యాన్స్ నచ్చలేదంటే.. నువ్వు నా మ్యూజిక్ వినలేదు' అని ఎంట్రన్స్ లోనే దర్శనమిస్తాయి. ఆర్జీవీ కెరీర్ లోని అతిముఖ్యమైన విషయాలకు సంబంధించిన ఫొటోలను ఆఫీస్ లో అమర్చారు. బిగ్ బీ అమితాబ్, శ్రీదేవి, నాగార్జున, ఏఆర్ రెహమాన్, వెంకటేష్ క్షణం క్షణం సినిమా పోస్టర్ సహా పలువురు ప్రముఖులతో కలిసి ఉన్న ఫ్రేమ్స్ ఆకట్టుకున్నాయి.

బూతు బొమ్మలు:ఆర్జీవీ అడల్ట్ ఫిల్మ్ జీఎస్టీకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. అలాగే అప్సర రాణి, లడ్కీ మూవీ పోస్టర్స్, పూజా బాలేకర్ సోయగాలు, మియా మాల్కోవా అశ్లీల చిత్రాలు దర్శనం ఇస్తాయి. అలాగే బట్టలు లేని బూతు బొమ్మలు సైతం ఓ ఫ్లోర్ అంతా అంటించారు. అత్యాధునిక వసుతులతో, అదిరిపోయే వాతావరణంతో ఆర్జీవీ డెన్ ఆకర్షణీయంగా ఉంది.

Ram Gopal Varma New Office RGV Den In Hyderabad Video Released

ఆర్జీవీ క్రియేటివిటీ:ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసే రైటర్స్, డైరెక్టర్స్, టెక్నికల్ టీమ్ అంతా కనిపించారు. ఒక్కో గది అద్భుతంగా ఉంది. ఇక ఈ డెన్ చూపించేందుకు సరిపోయేలా ఓ పాటను కూడా స్పెషల్ గా రూపొందించారు. పాటలో కూడా కొటేషన్స్ ఉన్నాయి. ఇక పాట చివర్లో షేర్ అంటూ పులి గాండ్రింపుతో రామ్ గోపాల్ వర్మ దర్జాగా కూర్చున్న సీన్ తో వీడియోను ముగించారు. ఈ ఆఫీస్ డిజైన్ ద్వారా ఆర్జీవీ క్రియేటివిటీ ఏంటో మరోసారి రుజువైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X