మియా మాల్కోవాతో ఇంకా చాలా పనుందట.. ఆర్జీవి న్యూ ప్లాన్స్!
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు డిఫరెంట్ టెక్నీషియన్ అనే ట్యాగ్ తో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకునేవారు. ఇప్పుడు కూడా ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకాస్త డిఫరెంట్ గా అడల్ట్ కంటెంట్ తో వార్తల్లో నిలుస్తున్నారు. వర్మ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయం గురించి బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా అర్థం కాదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇకపోతే మియా మాల్కోవాతో ఇప్పటికే రెండు సార్లు వర్క్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమెను ఇప్పట్లో వదిలే లేడని అనిపిస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెపై స్పందించిన వర్మ భవిష్యత్తులో మరి కొన్ని ప్లాన్స్ తో కలిసి పని చేయబోతున్నట్లు వివరణ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని ఐడియాలు రెడీ చేసుకున్నట్లు చెబుతూ.. క్లైమాక్స్ హిట్టులో ఆమెకు చాలా క్రెడిట్ దక్కుతుందని అన్నారు. అందుకే ఇంకా కొన్ని న్యూ ఐడియాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారట.

ఇకపోతే వర్మ ప్రస్తుతం నగ్నం అనే మరొక అడల్ట్ కాన్సెప్ట్ ని సిద్ధం చేశాడు. టీజర్ కూడా రిలీజ్ చేసిన ఆర్జీవి ఊహించని విధంగా మసాలా డోస్ ని గట్టిగానే పెంచినట్లు తెలుస్తోంది. అలాగే కరోనా వైరస్ తో కూడా ఒక ప్రయోగాత్మక కాన్సెప్ట్ ని తెరకెక్కించిన ఆర్జీవి త్వరలో ఆ సినిమాను కూడా ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్ లోనే రిలీజ్ చేయబోతున్నాడు. మరి వర్మ ఈ కాన్సెప్టులతో ఎంతవరకు లాభాలు అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











