స్వీటీ ఎంత అడిగితే అంత ఇవ్వండి.. RGV నగ్నం మూవీ రెమ్యునరేషన్‌పై శ్రీ రాపాక
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుందనే నమ్మకం ఉండేది. అయితే ఇటీవల కాలంలో ఆయన ఎంచుకుంటున్న కాన్సెప్టులు మాత్రం బి గ్రేడ్ సినిమాలను గుర్తు చేస్తున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన NNN షార్ట్ మూవీని ఏ రేంజ్ లో తీసాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాకు డబ్బులు బాగానే వచ్చాయి. ఇక అందులో నటించిన హాట్ బ్యూటీ శ్రీ రాపాక (స్వీటీ)కి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చాడు అనే విషయంలోకి వెళితే..

డోస్ మాత్రం తగ్గలేదు.
లాక్ డౌన్ కారణంగా సినిమాల జోష్ తగ్గినా ఆర్జీవి కాన్సెప్ట్ లు డోస్ మాత్రం తగ్గట్లేదు. విభిన్నమైన హాట్ మసాలా షార్ట్ మూవీస్ ని చిత్రీకరిస్తూ తనదైన శైలిలో క్యాష్ చేసుకుంటున్నాడు. వర్మ ఎంచుకున్న కాన్సెప్ట్ ఎలా ఉన్నా కూడా ఆయన ఆలోచన ధోరణి మాత్రం ఎక్కువగా ప్రమోషన్స్ పైనే ఉంచుతున్నాడు. వీలైనంత వరకు ఎక్కువ ఇంటర్వ్యూలతోనే తన 18+ సినిమాలకు బజ్ క్రియేట్ చేస్తున్నాడు.

లాభాలు బాగానే వచ్చాయి..
అయితే NNN సినిమా ఇటీవల విడుదలై మంచి వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన కొన్ని గంటల్లోనే 50వేలకు పైగా వ్యూవ్స్ తో మంచి వసూళ్లను అందుకుంది. ఒక వ్యూవ్ కి 200రూపాయలని ఫిక్స్ చేశారు. దీంతో ఆర్జీవి వరల్డ్ ఓటీటీ బిజినెస్ బాగానే లాభాలని అంధించింది. అయితే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం హీరోయిన్ శ్రీ రాపాక.

ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే..
కాన్సెప్ట్ ఎంతవరకు క్లిక్ అయ్యిందనే విషయం కన్నా సినిమాలో బ్యూటీ డోస్ ఎంతవతకు వర్కౌట్ అయ్యింది అనే విషయం గురించే ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. వర్మ కూడా అలాంటి టాక్ కోసమే ఎదురుచూశాడు. ఇక శ్రీ రాపాకకు ఈ సినిమా కోసం రోజుకు లక్ష రూపాయలు అనే డీలింగ్ సెట్ చేసుకున్నారట.
Recommended Video

ఎంత అడిగితే అంత..
ఈ కాన్సెప్ట్ కోసం ఇదివరకే ఆర్జీవి గారు ఎనిమిది మందిని ఆడిషన్స్ కి పిలిచి రిజెక్ట్ చేశారని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ రాపాక వివరణ ఇచ్చింది. అయితే సినిమా కోసం ఎక్కువ రోజులు సమయం తీసుకోలేదట. కేవలం ఒక రోజులో షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ డే డబ్బింగ్ చెప్పేశారట. ఇక షూటింగ్ అయిపోయిన తరువాత ఆమె పనితనాన్ని మెచ్చుకొని స్వీటీకి ఎంత అడిగితే ఇచ్చేయండి అని ఆయన మేనేజర్ కి RGV చెప్పారని శ్రీ రాపాక తెలియజేశారు.


Click it and Unblock the Notifications











