ఆ జోకర్‌తో బాహుబలి 3 అని వర్మ ట్వీట్, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని రాజమౌళి కామెంట్
కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో దర్శకుడు రాంగోపాల్ వర్మ రెచ్చిపోవడం ఆసక్తిని రేపుతున్నది. ట్రైలర్ రిలీజ్ రోజున సినీ గేయ రచయిత జొన్నవిత్తులతో వివాదానికి తెరతీశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై మరొకరు వాగ్భాణాలు, విమర్శలు చేసుకొన్నారు. జొన్నవిత్తుల చౌదరీ ఆని ఆర్జీవి అంటే.. పప్పు వర్మ.. ఇంటర్నేషన్ పప్పు వర్మ అంటూ జొన్నవిత్తుల విరుచుకుపడ్డారు. తాజాగా తాను జొన్న విత్తులను వదిలేసి.. కేఏ పాల్ అనే జోకర్‌తో ఆడుకొంటాననే ట్వీట్లతో హంగామా సృష్టిస్తున్నారు. ఇంతకు తాజా ట్వీట్లలో కేఏ పాల్, జొన్నవిత్తులను ఎలా టార్గెట్ చేశారంటే..

జొన్నవిత్తులపై సెటైర్
జొన్న పొత్తును బాగా తిన్నాను. ఇక నేను మరో జోకర్ పౌలీ బాయ్‌ను వైపు దృష్టిపెట్టాను అంటూ ట్వీట్ చేశారు. అలాగే జొన్నవిత్తుల ఫొటోను ట్యాగ్ చేశారు. గత కొద్ది రోజులుగా జొన్నవిత్తులను రకరకాల ట్వీట్లతో రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. జొన్నవిత్తు బాయ్ అవుట్. కేఏ పాల్ బాయ్ ఇన్. కమ్మరాజ్యంలో కడప రెడ్లులోని పాటను చట్టివలస ప్రజలకు అంకితం చేస్తున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు

కేఏ పాల్ బయోపిక్
ఇండియాలో జోకర్ సినిమా రిలీజై హిట్ అయితే.. బాహుబలి 3 కంటే కేఏ పాల్ బయోపిక్ పెద్దది. కొద్ది రోజుల క్రితం కేఏ పాల్ నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే.. తనను రాజమౌళి అమెరికా వాషింగ్టన్‌లో కలిశారు. బాహుబలి3 కోసం నాతో మాట్లాడారు అని ట్వీట్‌లో తెలిపారు.

ట్రంప్ టవర్‌లో
అమెరికాలోని వాష్టింగ్టన్‌లోని ట్రంప్ టవర్‌లో నేను రాజమౌళిని కలిసి లంచ్ చేశాం. బాహుబలి 3 సినిమాకు సైన్ చేయమని అడిగాడు. అయితే సార్ సార్ సార్ నేను చేయడం లేదు అని కేఏ పాల్ నాకు చెప్పారు. నిజంగా ఇది చెప్పారు. కేఏ పాల్ మీద ఒట్టు అంటూ మరో ట్వీట్ చేశారు.

నన్ను ఇన్వాల్స్ చేయవద్దని
అయితే తన ప్రమేయం లేకుండా.. ఆర్జీవి, కేఏ పాల్ మధ్య తన పేరు రావడంపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. రాజు గారూ.. నన్ను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయకండి అంటూ ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా కేఏ పాల్‌పై రకరకాల సెటైర్లతో విరుచుకుపడటం మీడియాలో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











