తారక్.. దయచేసి మీ బాబాయ్‌లా వెన్నుపోటు పొడవకు: దుమారం రేపుతున్న వర్మ కామెంట్స్
Recommended Video
ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను పాతిక స్థానాలు కూడా రాబట్టలేని దుర్భర స్థాయికి టీడీపీ దిగజారింది. టీడీపీలో ఉన్న బడా బడా నాయకులతో సహా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు లోకేష్ సైకిల్ టైరు కూడా పంక్చర్ కావడం టీడీపీ విమర్శకులకు మంచి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ భవితవ్యంపై తాజాగా రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు చూస్తే..

చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి
ఎలెక్షన్ ఫలితాల రోజే రామ్ గోపాల్ వర్మ తన పెన్నుకు పదును పెట్టారు. టీడీపీ పార్టీ ఓటమి పలు కావడం చూసి చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయం సాధించిన వైఎస్ జగన్‌కు అభినందలు తెలుపుతూ చంద్రబాబుకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ రకంగా వర్మ చేసిన ట్వీట్స్ టీడీపీ వర్గాలను కుదేలు చేశాయి.

జగన్ ప్రమాణ స్వీకారంలో వర్మ
ఇక భారీ ఎత్తున నిన్న(గురువారం) విజయవాడలో జరిగిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వర్మ కూడా హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఎందుకంటే ఇప్పటివరకూ ఆయన ఇలాంటి రాజకీయ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా ఎప్పుడూ పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో జగన్ ప్రమాణ స్వీకారంలో కెమెరా కళ్లన్నీ వర్మ పైనే ఉన్నాయి. దీంతో ఈ కార్యక్రమంలో వర్మనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

జగన్ ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే మరోసారి వర్మ రంగంలోకి దిగి చంద్రబాబు వెన్ను విరిచే విధంగా వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లలో టీడీపీ భవితవ్యం జూనియర్ ఎన్టీఆర్ చేతిలో మాత్రమే ఉందని తనదైన శైలిలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఓటమిని అందరూ మర్చిపోవాలంటే..
టీడీపీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ చేతికి అప్పగించాలని ఆయన సూచించారు. టీడీపీని కాపాడే సత్తా కేవలం తారక్‌కి మాత్రమే ఉందని, తన తాత పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఎన్టీఆర్ వెంటనే టీడీపీ పగ్గాలను చేతిలోకి తీసుకోవాలని మొదటి ట్వీట్ లో వర్మ పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌కి జై కొడుతూనే వర్మ
అదే ఊపులో రెండో ట్వీట్ చేసిన వర్మ.. జూనియర్ ఎన్టీఆర్‌కు తన తాత రామారావు గారిపై ఏమైనా అభిమానం ఉన్నా వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతలు తారక్ తన భుజాలపై వేసుకోవాలని ఆయనకు బూస్టింగ్ ఇచ్చే సందేశం ఇచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్‌కి జై కొడుతూ ఆ ట్వీట్ ముగించారు వర్మ.
బాలకృష్ణ దారిలో నువ్వు వెళ్లొద్దు.. వెన్నుపోటు పొడవొద్దు
చివరగా మళ్లీ వెన్నుపోటు టాపిక్ తీసి సెన్సేషనల్ ట్వీట్ చేశారు వర్మ. ''తారక్ నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. దయచేసి మీ బాబాయ్ బాలకృష్ణ దారిలో వెళ్లొద్దు. మీ తాతకు ఆయన అల్లుడు పొడిచిన వెన్నుపోటు కంటే పెద్ద వెన్నుపోటు మీ బాబాయ్ పొడిచాడు'' అని పరోక్షంగా బాలయ్యను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.


Click it and Unblock the Notifications











