RGV చేతిలో వోడ్కా గ్లాస్.. ఒడిలో యంగ్ హీరోయిన్.. వర్మ శృంగార లీలలు.. ఫోటోలు వైరల్!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలు తీయడం పక్కన పెట్టి.. అమ్మాయిలతో జల్సాలు, పబ్‌లో శృంగార లీలు జరపడంలో బిజీగా మారిపోయారు. గతంలో కూడా పబ్‌లో అమ్మాయిలు, హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన ఆనందాన్ని పంచుకోవడం తెలిసిందే. అయితే తాజాగా వర్మ ఓ యువ హీరోయిన్‌తో జల్సాలు చేస్తూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఎలాంటి కామెంట్లు చేశాడనే వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లో వర్మ యువ హీరోయిన్ సిరి స్టేజీతో ప్రత్యక్షమయ్యారు. ఎప్పటిలానే చేతిలో వోడ్కా గ్లాస్.. ఒడిలో అమ్మాయితో జల్సా చేస్తూ కనిపించాడు. తన ఒడిలో కూర్చొబెట్టుకొని అతిసన్నిహితంగా ఫోటోలకు ఫోజిలిచ్చాడు. వరుస ట్వీట్లతో వర్మ అభిమానులకు తనదైన శైలిలో కామెంట్లు విసిరారు.

సిరి స్టేజీతో వోడ్కా విన్నింగ్ మూమెంట్స్. ఈ వ్యవహారం చూస్తే.. నాపై నాకు ఈర్ష కలుగుతున్నది అని ఫస్ట్ ఫోటోను షేర్ చేసి కామెంట్ చేశాడు. బ్యూటీ సిరితో బీస్ట్ అంటూ తనకు తాను ట్యాగ్ ఇచ్చుకొన్నాడు. నాతో ఓ ఏంజెల్.. ఆమెతో ఓ డెవిల్ అంటూ మరో ఫోటోను పోస్టు చేశాడు. అలాగే జీవితాన్ని ఆస్వాదించాలంటే.. లైఫ్‌లో క్లారిటీ ఉండాలి బ్రో అంటూ మరో ఫోటోను ట్వీట్ చేశాడు.
వర్మ తన వీకెండ్‌ను అందమైన అమ్మాయితో చేతిలో మద్యం గ్లాసుతో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. చీర్స్.. మీరు కుల్లుతూ చచ్చి పోతే.. మరో రెండు పెగ్గులు వేస్తా అంటూ తన ఆనందాన్ని పంచుకొన్నాడు. చివరకు గుడ్ నైట్.. బిట్టర్ డ్రీమ్స్ అంటూ వర్మ తన సండేను అలా ముగించాడు.

వర్మ ట్వీట్ చేసిన ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశాడు. ఈ వయసులో కూడా ముసలోడు బాగానే ఆడుతున్నాడు అంటూ ఓ నెటిజన్ అంటే.. బతికితే మీలా బతకాలి సార్ అంటూ మరొకరు కామెంట్ చేశాడు. పెళ్లి చేసుకొని పెళ్లాం పిల్లల్ని వదిలేసి.. నువ్వు కూడా ఈ సమాజ సూక్తులు చెప్తావు అంటూ ఒక నెటిజన్ ఎద్దేవా చేశాడు.


Click it and Unblock the Notifications











